రష్యా వ్యాక్సిన్ పై ఆ దేశాల అభ్యంతరం

Update: 2020-08-13 01:30 GMT
ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతున్న వేళ తీపి కబురు చెప్పింది రష్యా. మందు లేక.. వ్యాక్సిన్ లేక అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిస్తూ రష్యా దేశం వ్యాక్సిన్ ను విడుదల చేసింది.అయితే రెండు క్లినికల్ ట్రయల్స్ మాత్రమే చేసి విడుదల చేసిన ఈ వ్యాక్సిన్ పై శాస్త్రవేత్తల్లో అనుమానాలున్నాయి.

రష్యా వ్యాక్సిన్ ను పరిశీలించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) ప్రకటించింది. ఇక కొంతమంది సైంటిస్టులు కూడా ఈ వ్యాక్సిన్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా వ్యాక్సిన్ ను ప్రస్తుతానికి తాము ఆమోదించడం లేదని ప్రకటించింది.

ఇక ఇజ్రాయెల్ దేశం రష్యా వ్యాక్సిన్ పై పరిశోధన చేసి అది పని చేస్తుందా లేదా అన్నది నిర్ధారించాకే ఆమోదిస్తామని తెలిపింది.
Tags:    

Similar News