అమెరికాలో భారతీయులు అందుకే టాప్ లో ఉన్నారట.?

Update: 2022-11-30 00:31 GMT
అమెరికాలోని అగ్ర కంపెనీలకు సీఈవోలుగా మాన భారతీయులే ఉన్నారు. మైక్రోసాఫ్ట్ కు సత్యనాదెళ్ల, గూగుల్ కు సుందర్ పిచాయ్ లు వ్యవహరిస్తున్నారు. ఇవేకాదు.. మొన్నటివరకూ ట్విట్టర్ సీఈవో కూడా మనపరాగ్ అగర్వాల్ నే. ఇటీవలే ఎలన్ మస్క్ తొలగించారు. ఇదే కాదు. పదుల సంఖ్యలో అమెరికన్ కార్పొరేట్ కంపెనీలను మన భారతీయులే నడిపిస్తున్నారు. మెజారిటీ సంస్థలకు మనోళ్లే కీలక స్థానాల్లో ఉన్నారు.

మరి అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల విజయానికి కారణం ఏంటన్న ప్రశ్న అందరికీ కలుగుతుంది. దీనికి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్ అడ్వైజర్, రచయిత డా. రాంచరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

అమెరికాలో భారతీయుల విజయాలకు ‘భిన్న సంస్కృతులు, నేపథ్యాలున్న వారిని కలుపుకొని ఓపికగా ముందుకు పోగలిగే సామర్థ్యమే భారతీయ సీఈవోల విజయాలకు కారణం’ అని రాంచరణ్ తెలిపారు. భారతీయుల కుటుంబ నేపథ్యాలు కూడా వారి విజయాలకు మరో కారణం అన్నారు. భారతీయుల కుటుంబాలు పెద్దవి కావడం.. భిన్న వ్యక్తిత్వాలున్న వారితో బాంధవ్యం నెరపడంతో వారితో సహజంగానే సహనం అలవడుతుందన్నారు.

అయితే భారతీయ సీఈవోలకు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే అలవాటే వారి విజయంలో ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు. చర్చల్లో పాల్గొనేటప్పుడు భారతీయ నాయకులు ఒక్కోసారి వేగంగా స్పందిస్తుంటారని.. ఇదే వారు ఎదుర్కొనే అతిపెద్ద సవాలని వివరించారు.

కమ్యూనికేషన్ స్కిల్స్ లో భారతీయులు మెరుగైనప్పటికీ నాయకత్వ స్థానాల్లో ఉన్న వారు అవతలివారు చెప్పేది ఓపికగా వినాలని.. ఎదుటివారి కోణంలో విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని రాంచరణ్ వివరించారు. సమస్యకు పరిష్కారం ఉన్నప్పటికీ అవతలివారు చెప్పేది వినడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News