కేసీఆర్ ఇలాకను తాకాయి.. ఇక దండయాత్రే

Update: 2020-06-25 03:45 GMT
తెలంగాణ ప్రభుత్వం భయాలు నిజమవుతున్నాయి. కరోనా మహమ్మారితో ఇప్పటికే కంగారుపడుతున్న కెసిఆర్ ప్రభుత్వం ఇప్పుడు మరో సమస్యను ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం పంటలు వేశారు. విత్తనాలు, మొలకలు వస్తున్నాయి. మిడతల దండు తెలంగాణకు వస్తే వినాశనమే. పంటలు నాశనమై వేల కోట్ల రూపాయల నష్టం. రైతులకు అపార నష్టం. రైతు ఆత్మహత్యలు జరుగుతాయి. ఇంతటి విపత్కర వేళ మిడతల దండు తెలంగాణ ప్రభుత్వాన్ని భయపెడుతోంది.
 
మిడుత సమూహాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండటానికి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కానీ తాజాగా  నీటిపారుదల మంత్రి హరీష్ రావు సొంత ఇలాక సిద్దిపేటపై విరుచుకుపడ్డాయి.
 
మిడతల దండు సిద్దిపేటలోని గోవర్ధనగిరి, గుడుకందుల, వర్ధరాజ్‌పల్లి, ఘన్‌పూర్ గ్రామాల్లోకి ప్రవేశించింది. మిడుతలు ప్రవేశించడంతో రైతులు, స్థానికులు  ఆందోళన చెందుతున్నారు.  
 
అంతకుముందు.. మిడుతలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సీఎం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మిడుతల కదలికపై నిఘాపెట్టి.. రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి చర్యలను పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు.
Read more!
 
ఈ మిడుత సమూహాలు రాబోయే రోజుల్లో తీసుకునే దిశపై సిఎం ఆరా తీశారు. రాజస్థాన్ నుండి దేశంలోకి ప్రవేశించిన లోకస్ట్స్ గ్రూప్,   మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్, భండారా మరియు గోండియాను తాకాయి. మిడుతలు మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు..మిడతలపై పురుగుమందులను పిచికారీ చేసి సరిహద్దుల్లో చంపాలి  అని చెప్పారు.
Tags:    

Similar News