లాక్ డౌన్: జనాలకు డీజీపీ స్టిక్ట్ వార్నింగ్

Update: 2020-04-20 14:51 GMT
తెలంగాణలో లాక్ డౌన్ హెచ్చరికలను మరింత కఠినతరం చేశారు పోలీసులు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలో మే 7వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని.. అవసరం లేకుండా బయటకు వచ్చి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏప్రిల్ 20 నుంచి కేంద్రం సడలించిన నిబంధనలు తెలంగాణలో అమలుకావని.. జనాలు ఫ్రీ అనుకొని రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

ఇక లాక్ డౌన్ ఉల్లంఘించిన వారి పాస్ లను రద్దు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఇచ్చిన పాస్ లను వెనక్కి తీసుకొని కొత్త పాస్ లిస్తామని తెలిపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పాస్ లు ఇస్తామన్నారు. ప్రజలు 3 కి.మీలు లోపలే తిరగాలని.. ఈ మేరకు రెసిడెన్స్ ఫ్రూఫ్ తీసుకురావాలన్నారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రులకే వెళ్లాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News