ఇండియన్ విస్కీ ధర రూ.10 లక్షలా..!
ఈ సందర్భంగా స్పందించిన అమృత్ డిస్టలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ రక్షిత్ ఎన్. జగ్దాలే... ఈ గుర్తింపు ఒక్క విస్కీ లేదా ఒక్క క్షణం గురించి కాదని.. ఇది మరెవరూ చేయని సమయంలో తాము కలిగి ఉన్న నమ్మకం యొక్క ఫలితమని తెలిపారు.;
భారత్ లో తయారయ్యే విస్కీ ధర లక్షల్లో ఉంటుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు! ఈ క్రమంలో... అమృత్ డిస్టిలరీస్ మరోసారి భారతీయ విస్కీని ప్రపంచ పటంలో నిలిపింది. ఇందులో భాగంగా... అమృత్ డిస్టిలరీస్ ఎక్స్ పెడిషన్ (15 ఏళ్ల సింగిల్ మాల్ట్) ప్రపంచంలోనే మూడవ అత్యుత్తమ విస్కీగా ర్యాంక్ పొందింది. జిమ్ ముర్రే విస్కీ బైబిల్ 2025–26 ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా.. దీని ధర అక్షరాలా రూ.10 లక్షలు. దీంతో.. ఈ వరల్డ్ మోస్ట్ ఫైనెస్ట్ విస్కీపై చర్చ మొదలైంది.
ప్రపంచంలో ప్రతీ విషయానికీ, అంశానికీ ఏదో ఒక సంస్థ ర్యాంకులు ఇస్తున్నట్లే.. విస్కీలకు ర్యాంకింగ్స్ ఇచ్చే జిమ్ ముర్రే విస్కీ బైబిల్ తాజా వెర్షన్ రిలీజైంది. ఇందులో "వరల్డ్ విస్కీ ఆఫ్ ది ఇయర్" టైటిల్ ను అమెరికాకు చెందిన ఫుల్ ప్రూఫ్ 1972 బౌర్బన్ కలిగి ఉంది. టాప్ సింగిల్ మాల్ట్ స్కాచ్ గా గ్లెన్ గ్రాంట్ (15 ఏళ్లు), రెడ్ బ్రెస్ట్ (12 ఏళ్లు) నిలవగా.. భారత్ లోని కర్ణాటకకు చెందిన అమృత్ డిస్టిలరీస్ ఎక్స్ పెడిషన్ (15 ఏళ్ల సింగిల్ మాల్ట్) మోస్ట్ ఫైనెస్ట్ విస్కీ ర్యాంక్ - 3ని పొందింది.
ఈ సందర్భంగా స్పందించిన అమృత్ డిస్టలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ రక్షిత్ ఎన్. జగ్దాలే... ఈ గుర్తింపు ఒక్క విస్కీ లేదా ఒక్క క్షణం గురించి కాదని.. ఇది మరెవరూ చేయని సమయంలో తాము కలిగి ఉన్న నమ్మకం యొక్క ఫలితమని తెలిపారు. ఇరవై సంవత్సరాల క్రితం.. భారతదేశం ప్రపంచ స్థాయి సింగిల్ మాల్ట్ ను ఉత్పత్తి చేయలేదని తమకు చెప్పబడిందని.. అయితే, తాము ఆ శబ్దాన్ని విస్మరించి, దృఢ నిశ్చయంపై దృష్టి పెట్టాలని ఎంచుకున్నామని అన్నారు.
ఈ క్రమంలో తాజాగా వెల్లడైన నివేదిక ప్రకారం... ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిలో నిలిచి ఉండటం తమకు ఆశ్చర్యమేమీ కలిగించదని.. అది కేవలం ఒక ధ్రువీకరణ మాత్రమే అని.. అమృత్ సంప్రదాయాన్ని అనుసరించడానికి బయలుదేరలేదని.. దాన్ని సవాలు చేయడానికి బయలుదేరిందని.. జగ్దాలే చెప్పుకొచ్చారు. కాగా... 1948లో బెంగళూరులో దివంగత రాధాకృష్ణ జగ్డేల్ స్థాపించిన అమృత్ డిస్టిలరీస్.. ఎన్.ఆర్. జగ్డేల్ గ్రూప్ లో భాగం.
ఇది సుమారు 1,600 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ క్రమంలో... 2009లో అమృత్ ఫ్యూజన్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన మొదటి భారతీయ సింగిల్ మాల్ట్ గా అవతరించినప్పుడు ఈ కంపెనీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇక.. కంపెనీ ప్రకారం, డిస్టిలరీ భారతీయ బార్లీని ఉపయోగిస్తుంది.