ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ తో మంచంపై భార్య... భర్త షాకింగ్ నిర్ణయం!
ఈ సమయంలో తన భర్తపై దాడి చేయమని ఆ ఇద్దరు యువకులను రెచ్చగొట్టిందని అతడు చెబుతున్నాడు.;
ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తోన్న వివాహేతర సంబంధాలు.. వాటి ఫలితంగా జరుగుతున్న హత్యలు.. ఫలితంగా జైలు పాలవుతున్న జీవితాలు.. నరక కూపాలుగా మారుతున్న కుటుంబాలు వెరసి.. సమాజం మరింతగా రోజు రోజుకీ పతనావస్థకు చేరుకుంటుందనే చర్చను తెరపైకి తెస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ తో కలిపి మంచంపై పడుకుని కనిపించిన భార్య విషయంలో ఆమె భర్త షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును... చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఓ జంట ఇటీవల ఇంట్లో పెద్దలను ఎదురించిమరీ వివాహం చేసుకున్నారు. సుమారు నెల రోజులగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అద్దె గదిలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనపై సదరు భర్తకు అనుమానం వచ్చింది. ఇందులో భాగంగా.. స్థానికంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని పక్క పక్క గదుల్లో నివసించే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులతో ఆమె సంబంధం పెట్టుకుందని అతడు అనుమానించాడు!
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం.. తాను గ్రామానికి వెళ్లి వస్తానని, రాత్రికి రావడం కుదరదని చెప్పి వెళ్లాడు! అన్నట్లుగానే రాత్రి ఇంట్లోకి రాలేదు కానీ ఇంటి బయట వరకూ వచ్చాడు. ఆ సమయంలో.. అతడు ఊహించినట్లు గానే అతని భార్య ఇద్దరు ఇంజినీరింగ్ యువకులతో కలిసి మంచం మీద పడుకుని ఉన్నట్లు గుర్తించాడు! ఈ క్రమంలో.. తన మొబైల్ ఫోన్ లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే.. ఈ విషయాన్ని అతని భార్య గ్రహించేసింది!
ఈ సమయంలో తన భర్తపై దాడి చేయమని ఆ ఇద్దరు యువకులను రెచ్చగొట్టిందని అతడు చెబుతున్నాడు. ఈ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సంబంధం ఉన్న వారందరినీ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సమయంలో.. ఈ వ్యవహారాన్ని తాను ఇంటివద్దే పరిష్కరించుకుంటానని చెప్పిన భర్త, పోలీసులను ఒప్పించి భార్యను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు యువకులు మాత్రం స్టేషన్ లోనే ఉన్నారు!
ఈ క్రమంలో.. ఇంటికి వచ్చిన అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులను విడుదల చేయాలని తనపై ఒత్తిడి తెచ్చిందని.. అందుకు తాను ఒప్పుకోకపోతే తనను వదిలి వారితో కలిసి జీవిస్తానని బెదిరించిందని అతను ఆరోపించాడు. ఆ తర్వాత జరిగిన వాదనలో తనను చంపిస్తానని ఆమె చెప్పిందని కూడా అతను ఆరోపించాడు. దీంతో.. మరింత ఆగ్రహానికి లోనైన భర్త.. తన భార్య గొంతు కోసి, మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, ఆ గదిలోనే వదిలేసి, మరుసటి రోజు స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు!
దీంతో.. పోలీసు అధికారులు అతనితో పాటు వారు అద్దెకు ఉంటున్న గదికి వెళ్లారు.. అక్కడ ఆమె మృతదేహం దుప్పటిలో చుట్టబడి ఉండటం గమనించి.. దాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మరోవైపు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది!