ఉట్టికి ఎగరలేని కాంగ్రెస్ .... స్వర్గానికి ఎగురునా..

Update: 2018-12-18 08:45 GMT
ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు పెద్దలు.. ప్రస్తుతం కాంగ్రెస్ సినీయర్ల నాయకులకు ఈ సామేతలు అతికినట్లు సరిపోతాయి. తెలంగాణలో ముందస్తు ముగిసింది... మహాకూటమి నాయకులకు చావు తప్పి కన్ను లొట్టపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఘోర పరాజయం ఎదురైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా విఫలమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమి బాధతో మిన్నకుండలేదు. తిరిగి అంతే ఉత్సాహంతో రాబోయే సర్వాత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్నారు.  

2019లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో పోటీకి కాంగ్రెస్ సినీయర్లు పోటీ పడుతున్నారు. తెలంగాణలో ఓడిపోయిన నాయకులందరూ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. అయితే అపెంబ్లీకి నెగ్గలేని వారు లోకసభకు నెగ్గగలరా... అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ కోవలోకి ముందరగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి క్యూలైన్లో. వచ్చే సంవత్సరం జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ అధిష్టానం వద్ద తమ పావులు కదుపుతున్నారు. డీకె. అరుణ కూడా లోక్‌సభ స్దానానికి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. తనకు కాకపోయిన తన కుమార్తే ఎంసీ స్దానానికై తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారని వినికిడి.  డీకె. అరుణ తన కుమార్తెకు మహబూబ్‌నగర్ స్దానం కోసం  ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే బాటలో కొడంగల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రేవంత్ రెడ్డి కూడా ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.  అయితే రేవంత్ రెడ్డి కూడా మహాబూబ్‌నగర్ స్దానం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జైపాల్ రెడ్డి పాలమూరు టిక్కెట్లు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పొన్నాల లక్ష్మయ్య, భువనగిరి ఎంపీ టిక్కెట్ కోసం కాంగ్రెస్ అధిష్టానం వద్ద తమ ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు. ఖమ్మం జిల్లా ఎంపీ టిక్కెట్టు కోసం రేణుకా చౌదరి కన్నేసారని అంటున్నారు. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ కాస్త మెరుగ్గానే ఉంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు ఉండడంతో రేణుకా చౌదరి ఎంపీ సీటు కోసం ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి సుధాకర్ కూడా ఖమ్మం సీటు కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఇలా తెలంగాణ కాంగ్రెస్ సినీయర్ నాయకలు ఎవరికి వారు క్రింద పడ్డా కూడా మరోసారి పైకి లేద్దమని ప్రయత్నిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన ఈ నాయకులు లోక్‌సభ ఎన్నికలలో గెలవగలరా.. అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Tags:    

Similar News