ట్రంప్ ఆంక్షలు ... కెనడా వైపు తొంగిచూస్తున్న టెక్కీలు !

Update: 2020-06-27 11:52 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైరస్ కారణంగా అన్ని ర‌కాల వ‌ర్క్ వీసాల‌పై నిషేధం విధించిన నేప‌థ్యంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కెనడా వైపు చూసే అవకాశం ఉందని అంత‌ర్జాతీయ అంశాల‌పై విశ్లేష‌ణ‌లు చేసే నిపుణులు చెబుతున్నారు. నిపుణులు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే 2017లో ప్రారంభించిన గ్లోబల్ స్కిల్స్ స్ట్రాటజీ (జీఎస్ఎస్) ప్రోగ్రామ్ ద్వారా కెనడా మూడేండ్ల‌లో ఐదురెట్లు ఎక్కువ మందికి వీసాలు జారీ చేసింది.

ఆ దేశ ఇమ్మిగ్రేషన్, వలసదారులు, పౌరసత్వ సంస్థ (ఐఆర్‌సీసీ) ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.ఐఆర్‌ సీసీ సమాచారం ప్రకారం.. ఇంటరాక్టివ్ మీడియా డెవలపర్‌లు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనలిస్ట్‌లు, కన్సల్టెంట్‌ లు, కంప్యూటర్ ప్రొగ్రామర్‌ ల క్యాటగిరీల‌ కింద 23 వేల మందికి కెనడా వీసాలు ఇచ్చినట్లు తెలిపింది.

 2020 జనవరి నుంచి మార్చి మధ్య ఇవే ఐదు కేటగిరీలకు చెందిన 2,300 మంది అప్లికేషన్లకు ఆమోదం లభించిందని వివరించింది. అప్లికేషన్ పెట్టుకున్న రెండు వారాల్లోనే ప్రాసెసింగ్ పూర్తవుతున్నట్లు వెల్లడించింది. అయితే కోవిడ్–19 ప్రభావంవ‌ల్ల ద‌ర‌ఖాస్తు పెట్టుకునే వారి సంఖ్య భారీగా తగ్గిన‌ట్లు తెలిపింది.
Tags:    

Similar News