రైతు వేదికలకు ఐ-హబ్ ద్వారా ఇక్రిశాట్ సేవలు:కేటీఆర్

Update: 2020-09-10 01:30 GMT
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోన్న సంగతి తెలిసిందే. పంటల సాగు విధానంలో సమూల మార్పు తేవాలన్న ఉద్దేశంతో తీసుకుంటున్న చర్యలలో భాగంగా రైతు వేదికలు ఏర్పాటు చేయాలని సంకల్సించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 127 రైతువేదికలు నిర్మించాలని, ఒక్కో రైతు వేదికకు రూ.20 లక్షలు కేటాయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వ్యవసాయ రంగానికి ఆధునిక, సాంకేతిక హంగులు అద్దేందుకు మరో అడుగు వేసింది టీ సర్కార్. రైతు వేదికలను ఇంటర్నెట్ ద్వారా ఐ హబ్ కు అనుసంధానించబోతున్నామని, దీని ద్వారా రైతులకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇక్రిశాట్( ICRISAT) సేవలను అందించాలని సంకల్పించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ అనుసంధానం ద్వారా ఇక్రిశాట్ సేవలను రైతులు వినయోగించుకుంటారని, తెలిపారు.


రైతు వేదికలలో ఇక్రిశాట్ ద్వారా రైతులకు వ్యవసాయంలో మెరుగైన సలహాలు అంది ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు. 400 స్టార్టప్ కంపెనీలను టీ హబ్ ప్రోత్సహించిందని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. టీ హబ్ లో ఇప్పటివరకు 1120 స్టార్ట్ అప్ కంపెనీలు 1800 కోట్ల పెట్టుబడులు పెట్టాయని, 2500 మందికి ఉపాధి కల్పించాయని వెల్లడించారు. రాయదుర్గంలో టీ హబ్-2 నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది చివరికల్లా పూర్తవుతుందని తెలిపారు. 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.276 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు.
Tags:    

Similar News