థాంక్ యూ చంద్రబాబూ...వారందరికీ గుడ్ న్యూస్
ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పారు. అంతే కాదు ఈ పండుగను మరింత ఉత్సాహంగా చేసుకోవడానికి అవసరమైన ఉత్సాహాన్ని వారికి అందించారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పారు. అంతే కాదు ఈ పండుగను మరింత ఉత్సాహంగా చేసుకోవడానికి అవసరమైన ఉత్సాహాన్ని వారికి అందించారు. తాను నారావారిపల్లెకు సంక్రాంతి సంబరాలకు వెళ్తూ బాబు చెప్పిన ఈ తీపి వార్త ఇపుడు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిగిలిన వర్గాలకు ఎంతో హుషార్ తెచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు అయితే డీఏ ఎరియర్స్ చెల్లింపులు క్లియర్ చేస్తూ బాబు ప్రభుత్వం శుభవార్తనే చెప్పింది.
వారందరికీ మేలు :
ఏపీలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు మేలు చేసేలా డీఏ ఎరియర్స్ లు విడుదల చేస్తూ బాబు సర్కార్ కీలక నిర్ణయం తెసుకుంది. దీంతో 2023 జూలై 1 నుంచి డీఏ డీఏ ఎరియర్స్ సరెండర్ లీవ్స్ వంటి వాటి విషయంలో గుడ్ న్యూస్ నే అందించారు. ఏపీలో ఉన్న రెండు లక్షల 70 వేల మంది పెన్షనర్లకు అలాగే రెండు లక్షల ముప్పయి వేల దాకా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం 1,100 కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్స్ చెల్లింపుల కోసం మరో 110 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వేళ ప్రభుత్వం తమకు తీపి వార్తను చెప్పిందని వారు అంటున్నారు.
కాంట్రాక్టర్ల కోసం :
ఇక ప్రభుత్వ ప్రాజెక్టులు ఇతరత్రా అభివృద్ధి పనులను చేసి ఎన్నాళ్ళ నుంచో తమ బకాయిలు చెల్లించాలని కోరుతున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం వెరీ గుడ్ న్యూస్ అని చెప్పింది. ఏకంగా పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు మేలు చేసెలా 1,243 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. దాంతో వారంతా థాంక్ యూ బాబూ అని అంటున్నారు.
ఆర్ధిక శాఖ క్లియరెన్స్ :
ఇదిలా ఉంటే ఆర్ధిక శాఖ పండుగ వేళ ఈ మేరకు క్లియరెన్స్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు ఏపీలోని మొత్తం అయిదున్న లక్షల మందికి ప్రయోజనం చేకూరేలా 2,653 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఇక సంక్రాంతి పండుగను ప్రతీ లోగిలిలోనూ జరుపుకునేందుకు అంతా సిద్ధం అయ్యేలా ప్రభుత్వం ఈ మంచి నిర్ణయం తీసుకుందని అంతా అంటున్నారు. దాంతో ఈ సంక్రాంతి వెరీ స్పెషల్ అని అంతా అంటున్నారు.