ప్రైమ్ వీడియో యూజర్లకు మరో సమస్య
టీవీ ఛానెల్స్ లో ఎక్కువగా యాడ్స్ వస్తాయనే కారణంతోనే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీల వైపు మొగ్గు చూపారు.;
టీవీ ఛానెల్స్ లో ఎక్కువగా యాడ్స్ వస్తాయనే కారణంతోనే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఓటీటీల వైపు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు ఓటీటీల్లో కూడా అదే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు అసలు ఓటీటీ అంటే యాడ్స్ అనేవే ఉండేవి కావు. కానీ ఇప్పుడలా కాదు, ప్రతీ ఓటీటీలో యాడ్స్ ఎక్కువైపోతున్నాయి. పైగా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.
సబ్‌స్క్రిప్షన్ విషయంలో సమస్య
అమెజాన్ ప్రైమ్ వీడియో ఎంతో మంది యూజర్ల నుంచి కొన్ని నెలలుగా కంప్లైంట్స్ ను ఎదుర్కొంటుంది. సబ్‌స్క్రైబర్లు రెగ్యులర్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంతో పాటూ పదే పదే టెక్నికల్ ఇష్యూస్ వస్తుండటంపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ రేట్లు ఎక్కువవడంతో పాటూ ప్లాట్‌ఫామ్ లో పెరుగుతున్న యాడ్స్ విషయంలో కూడా యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు.
అధిక యాడ్స్ తో లేనిపోని తలనొప్పి
ప్రీమియం చెల్లించి కూడా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వకపోవడం వినియోగదారులను నిరాశకు గురి చేస్తోంది. పెంచిన ప్రీమియం వల్ల యూజర్లకు ఎలాంటి ప్రయోజనం లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే తాజాగా వీటికి మరో సమస్య తోడైంది. ప్రైమ్ వీడియోలోని ఒక షో ను స్ట్రీమ్ చేస్తున్నప్పుడు యాప్ పదే పదే క్రాష్ అవుతుందని చెప్తూ ఓ యూజర్ నెట్టింట వీడియోను పోస్ట్ చేశారు.
ల్యాప్ టాప్ హార్డ్ వేర్ వల్ల ఇలా జరుగుతుందేమోనని మొదట్లో అనుకున్నట్టు కానీ తర్వాత అసలు సమస్య యాప్ లోనే ఉందని తెలిసిందని ఆ యూజర్ అసలు రీజన్ ను పోస్ట్ చేశారు. వీడియో క్వాలిటీ, యాడ్స్ విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న ప్రైమ్ వీడియో యాప్, విండోస్ లో సరిగ్గా వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. మరి ఈ సమస్యలను ప్రైమ్ వీడియో ఎప్పుడు సెట్ చేస్తుందో చూడాలి.