• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీమిండియా కోచ్...

టీమిండియా కోచ్ రవిశాస్త్రి లవ్ స్టోరీ తెలుసా?

By - Tupaki Desk
Update: 2021-10-24 08:32 GMT
సినిమా, క్రికెట్ రంగాలు దగ్గరి సంబంధాలు కలిగి ఉంటాయి. రెండు రంగాల్లో టాలెంట్ ఉంటేనే రాణిస్తారు. తమ శక్తీ యుక్తులను ధారపోస్తేనే ఈ రంగాల్లో సక్సెస్ అవుతారు. అయితే సినిమా, క్రికెట్ సెలబ్రెటీలుగా మారిన తరువాత కొందరు తమ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మరికొందరు ఇరు రంగాల మధ్య ప్రేమానుబంధాలు ఏర్పరుచుకొని ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోతారు. సినిమావాళ్లతో క్రీడాకారులు ప్రేమలో పడ్డవారు ఆ తరువాత పెళ్లి చేసుకొని జీవితం సాగిస్తున్వారు లేకపోలేదు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం సినీ రంగానికి చెందిన హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సాంప్రదాయం కొత్తదేమీ కాదు. అలనాటి క్రికెట్ హీరోలు, సినిమా హీరోయిన్లతో ప్రేమాయణం సాగించారు. వారిలో రవిశాస్త్రి కూడా ఉన్నారు. ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న రవిశాస్త్రి, అమృత్ సింగ్ ల మధ్య సాగిన ప్రేమాయణం నిశ్చితార్థం వరకు వెళ్లిందని ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత ఏం జరిగింది..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ఫాంలో ఉన్న సమయంలో అమృత సింగ్, సన్నీ డియోల్ తో ప్రేమలో పడింది. అయితే అతనికి పెళ్లయిందన్న విషయం తరువాత తెలిసింది. దీంతో తాను మోసపోయానని భావించిన అమృత అతనితో దూరమైంది. ఆ తరువాత తన బాధను  మరిచిపోయేందుకు ఎక్కువగా స్నేహితులతో గడిపేది. ఈ క్రమంలో రవిశాస్త్రి పరిచయమయ్యాడు. అంతకుముందు క్రికెట్ అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా స్టేడియాలకు వెళ్లేది అమృతా. అయితే అమృతకు రవిశాస్త్రి పరిచయం అయిన తరువాత  ఆమె కోసం షూటింగ్ స్పాట్ కు వెళ్లేవాడు. దీంతో ఇద్దరు సన్నిహితులైపోయారు. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు.

రవిశాస్త్రికి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా అమృతతో గడిపేవాడు. కాఫీడేలు, డిన్నర్ మీట్లకు లెక్కలేకుండా పోయింది. వీరి సన్నిహితం గురించి కొన్ని పత్రికలు పేజీలు గా రాశారు. ఓ మ్యాగ్జిన్ వీరిద్దరు కలిసున్న ఫొటోను మొదటి పేజీలో ప్రచురించింది. అయితే ఆ కథనాలు వీరు ఖండించలేదు. దీంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ప్రేక్షకులకు కూడా అర్థమైపోయింది. కొన్నాళ్ల తరువాత ‘సినీ బ్లిట్స్’ అనే మ్యాగ్జిన్ రవిశాస్త్రి, అమృతకు నిశ్చితార్థం అయిపోయిందని, న్యూయార్క్ లోని ఓ హోటల్లో వీరు ఉంగరాలు మార్చుకున్నారని రాసింది.

ఇలా వీరి మధ్య స్వర్ణ రోజులు సాగుతున్న సమయంలో అమృత సినిమాల్లో బీజీగా మారింది. తీరిక లేకుండా సినిమాలు చేస్తుండడంతో అమృత, రవిశాస్త్రిని కలిసే అవకాశం లేకుండా పోయింది. అయితే రవిశాస్త్రి పెళ్లికి ముందు అమ్మాయిలు సినిమాల్లో నటించినా.. పెళ్లి తరువాత ఇల్లాలిగా ఉండాలని అతని అభిప్రాయం. ఈ విషయాన్ని ఓ సారి ప్రస్తావించాడు రవిశాస్త్రి . అయితే ఈ అభిప్రాయానికి అమృత ఒప్పుకోలేదు.దీంతో ఇద్దరు సారీ.. అంటే సారీ.. అనుకున్నారు. ఆ తరువాత విడిపోయారు.

ఆ తరువాత ఇద్దరు మరో పెళ్లి చేసుకున్నారు. అమృత సింగ్ సైఫ్ అలీఖాన్ ను 1991లో పెళ్లి చేసుకుంది. రవిశాస్త్రి రీతూ సింగ్ ను 1990లో వివాహం చేసుకున్నారు. అయితే రవిశాస్త్రి రీతూ సింగ్ కు 22 ఏళ్లకు విడాకులిచ్చాడు. అమృతా సింగ్ సైతం సైఫ్ అలీఖాన్ తో 2004లో వివాహం రద్దు చేసుకుంది. అయితే ఆ తరువాత రవిశాస్త్రి నిమ్రత కౌర్ తో ప్రేమలో ఉన్నారని అంటున్నా  ఆ విషయం నిర్దారణ కాలేదు. అయితే ఈ వార్తలను కనీసం ఖండించలేదు. అయితే రవిశాస్త్రి లైఫ్లో మాత్రం అమృత సింగ్ ప్రేమయాణం ఎప్పటికీ గుర్తుంటుందని సినీ ప్రేమికులు అంటున్నారు.
Tags:    
  • Ravi Shastri 
  • BCCI 
  • Team India 
  • Ravi Shastri love story 
  • Ravi Shastri breakup story 
  • Ravi Shastri Amrita Singh 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS