రైతు వేషంలో టీడీపీ ఎంపీ..మోడీ కోసం గాలింపు

Update: 2018-03-07 12:00 GMT
తెలుగుదేశం పార్టీ నేత‌ల ఆందోళ‌న కొన‌సాగుతోంది. ఓ వైపు ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు నో చెప్ప‌డం మ‌రోవైపు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చిచెప్ప‌డంతో టీడీపీ - వైసీపీ ఎంపీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. వ‌రుస‌గా మూడో రోజు సైతం త‌మ ఆందోళ‌న‌ను కొన‌సాగించారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ - వైసీపీ ఎంపీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. విభజన హామీలు అమలు చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

ఇక త‌న‌దైన శైలిలో నిర‌స‌న తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మూడో రోజు కూడా గెట‌ప్ వేశారు. ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ ద‌ఫా ఆయ‌న రైతు వేషంలో వినూత్న నిరసన చేపట్టారు. అన్న‌దాత‌ వేషధారణలో పార్లమెంటుకు వచ్చిన ఆయన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు పలకరించారు. అక్క‌డితో ఆగిపోకుండా...`మోడీ గారు ఎక్కడుంటారండీ..` అంటూ ఆయన పలువురు ఎంపీలను అమాయకంగా అడుగుతూ నిరసన తెలిపారు. అమరావతి శంకుస్థాపన వచ్చిన ప్రధాని మట్టి - నీరు ఇచ్చారని.. ఇప్పడవి ఆయనకే తిరిగిచ్చేస్తామని ఎద్దేవా చేశారు. శివ‌ప్ర‌సాద్ త‌న‌దైన శైలిలో హ‌ల్ చ‌ల్ చేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.
Tags:    

Similar News