లోకేష్ 'మాస్' తిప్పలు.. ఫలించేనా?
టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్‌కు పెద్ద సవాలే ఎదురు కానుంద ని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయన క్లాస్ నాయకుడిగా ఉన్నారు. ఆయన ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా.. జగన్‌పై ఎన్ని రకాలుగా విరుచుకుపడ్డా.. కూడా.. `క్లాస్` అనే ముద్ర నుంచి బయటకు రాలేక పోతున్నారు. ఇది ఆయనకు రాజకీయంగా అడ్డు వస్తోందనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. దీంతో క్లాస్ ఇమేజ్ నుంచి బయట పడి.. మాస్ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నా రు.
కానీ, ఇప్పటికీ .. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ ప్రసంగాలు చేసినా.. లోకేష్‌ను క్లాస్ పీపులే.. ఫాలో అవుతున్నారు తప్ప.. మాస్ జనాలు ఆయనకు చేరువ కాలేక పోతున్నారు. ఇతర పార్టీలను చూసుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లాస్‌గా ఉండాలని ప్రయత్నం చేసినా.. మాస్ ఆయనను వదిలి పెట్టరు. ఇక, వైసీపీ అధినేత జగన్ కూడా మాస్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే.. మాస్‌లో పవన్‌ను జనసేనాని.. అని పిలుచుకుంటే... జగన్‌ను.. జగనన్న అనే పేరుతో పిలుస్తారు. ఇది వారికి మాస్ ఇమేజ్‌ను తీసుకువచ్చింది.
ఈ తరహాలో మాస్ ఇమేజ్ సొంతం చేసుకునేందుకు నారా లోకేష్ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే తన విమర్శల్లో సామాన్యులకు అర్ధమయ్యే భాషనే వాడుతున్నారు. పైగా జగన్‌పై జోకులు కూడా వేస్తున్నారు. ఇంత చేస్తున్నా.. లోకేష్ క్లాస్ పీపుల్‌కు చేరువ అయినంత వేగంగా.. మాస్ పీపుల్‌కు చేరువ కాలేక పోయారు. ఈ క్రమంలోనే తాజాగా 40 వసంతాల టీడీపీ వేడుక వేదికగా.. లోకేష్ మరోసారి మాస్ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సినిమా డైలాగులతో.. జగన్‌పై విరుచుకుపడ్డారు.
అంతేకాదు.. తన భాషను కూడా సామాన్యులకు చేరువగా ఉండేలా చూసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ వ్యవస్థాపకుడు.. ఎన్టీఆర్‌ను దేవుడిగాను, ప్రస్తుత పార్టీ అధినేత చంద్రబాబును రాముడిగాను పోల్చిన లోకేష్.. తనను తాను మాత్రం మూర్ఖుడిగా అభివర్ణించుకున్నారు. ఇది పూర్తిగా మాస్‌ను దృష్టిలో పెట్టుకుని.. యువతను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నమని.. పరిశీలకులతో పాటు. పార్టీ సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.
తమ పార్టీ కార్యకర్తలను ఏడిపించిన వారిని వదిలేది లేదని చెప్పడం ద్వారా.. తను కార్యకర్తలకు అండగా ఉంటానని పరోక్షంగా ఆయన హామీ ఇచ్చారు. ఇలా.. మొత్తంగా.. లోకేష్ చేసిన మాస్ ప్రయత్నంపై ఇంటా బయటా కూడా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.