తిరుమలలో సందడి చేసిన స్టార్ సెలబ్రిటీ.. పిక్ వైరల్!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కాస్త సమయం దొరికితే చాలు పని కల్పించుకొని మరీ వెళ్లి తిరుమలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-24 07:40 GMT

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కాస్త సమయం దొరికితే చాలు పని కల్పించుకొని మరీ వెళ్లి తిరుమలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తిరుమలలో స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. స్టార్ హీరోలను మొదలుకొని టీవీ ఆర్టిస్టుల వరకు.. అలాగే వ్యాపార , రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా తమ జీవితంలో ముఖ్యమైన రోజుల సందర్భంగా ఇలా స్వామివారిని సందర్శించి ఆశీర్వాదం పొందుతున్నారు. ఇలా ఎంతోమంది స్వామివారిని దర్శించుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక స్టార్ సెలబ్రిటీ కూడా తన భర్తతో కలిసి స్వామివారిని దర్శించుకుంది. ఉదయాన్నే దర్శనం చేసుకున్న ఈమె అనంతరం తన భర్తతో కలిసి ఫోటోలు దిగి వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చూడ చక్కని జంట అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఆమె ఎవరో కాదు పీవీ సింధు. ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఈమె తాజాగా తన భర్త వెంకట దత్త సాయితో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఇటీవల డిసెంబర్ 22న మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ఈమె.. ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా సందడి చేశారు. ఇకపోతే వీఐపీ కేటగిరీలో దర్శించుకున్న వీరిద్దరికి వేద పండితులు రంగనాయకులు మండపంలో వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఆమెకు పట్టు వస్త్రాలు, పవిత్ర తీర్థంతో పాటు ప్రసాదంతో సత్కరించారు.

ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ తన మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా భగవంతుడి ఆశీస్సులు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో బాగా రాణించి విజయం సాధిస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేసింది పీవీ సింధు.

ఇండియా తరఫున అద్భుతమైన కెరియర్ ను ఆస్వాదించిన ఈమె రాబోయే ఇండియా ఓపెన్ 2026లో ఆడే అవకాశం కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది జనవరి 13న ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి షట్లర్లతో పోటీ పడబోతోంది పీవీ సింధు.

ఇకపోతే ఇండియాలో అత్యంత విజయవంతమైన ప్లేయర్ లలో లో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఒలంపిక్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్లు అలాగే ప్రపంచ పర్యటన వంటి ఎన్నో టోర్నమెంట్లలో పథకాలు గెలుచుకుంది. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మొదటి భారతీయురాలిగా ఒలంపిక్ క్రీడలలో వరుసగా రెండు పథకాలు గెలుచుకున్న ఇండియన్ రెండవ ప్లేయర్గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా 2017 ఏప్రిల్ లో తన కెరియర్ లోనే అత్యధిక ప్రపంచ ర్యాంకింగ్లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది పీవీ సింధు.

Tags:    

Similar News