ఫుల్ ఫాం లో లోకేష్... టీడీపీలో కొత్త జోష్ ?
చినబాబు ఆరితేరిపోతున్నారు. పంచులను పేల్చడంతో చంద్రబాబుని మించుతున్నారు. ఇన్నాళ్ళూ టీడీపీలో ఒక బెంగ ఉండేది. చంద్రబాబు రేంజికి చినబాబు చేరుకోగలడా అన్నదే ఆ చింత. కానీ గత కొన్ని నెలలుగా చూస్తే లోకేష్ బాబు లో చాలా మార్పు వచ్చింది. ఆయన మాటల తూటాలకు అధికార వైసీపీ గింగిరాలు కొడుతోంది. లోకేష్ డొంట్ కేర్ అంటూ చేస్తున్న దూకుడుతో అధిక పక్షంలో అలజడి రేగుతోంది.
తాజాగా పెగాసస్ ఇష్యూలో లోకేష్ వైసీపీ సర్కార్ ని ఎదుర్కొన్న తీరు బాగా ఉందని అంటున్నారు. పెగాసస్ మీద ఆరోపణలు వచ్చిన వెంటనే నాటి ఐటీ మంత్రిగా బాధ్యతగా లోకేష్ రియాక్ట్ అయ్యారు. అంతే కాదు, తామే కనుక పెగాసస్ సాఫ్ట్ వేర్ ని వాడితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చేవారా అంటూ లాజిక్ పాయింట్ తో ఆయన ఢీ కొట్టిన వైనం నిజంగా గ్రేట్ అంటున్నారు.
ఒకవేళ దీని మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే ఒకే ఒక పంచ్ తో లోకేష్ పటాపంచలు చేశారు అని అంటున్నారు. అదే విధంగా జంగారెడ్డిగూడెం లో జరిగిన కల్తీ సారా ఘటనకు సంబంధించి లోకేష్ కౌన్సిల్ లోపలా బయటా అనుసరించిన తీరు పట్ల కూడా తమ్ముళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు. జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేయడం ద్వారా సర్కార్ ని కార్నర్ చేశారని అంటున్నారు.
ఏపీలో ఏ సంఘటన జరిగినా కూడా లోకేష్ వాయువేగంతో స్పందిస్తున్నారు. అంతే కాదు సర్కార్ ని తూర్పారా పట్టడంలో ముందుంటున్నారు. ఇక మీ ఇష్టం వచ్చిన కేసులు మాపై పెట్టుకోండి మేము దేనికీ జడిసే పరిస్థితే లేదు అని లోకేష్ చేస్తున్న ఓపెన్ చాలెంజ్ ఇపుడు యువతను ఆకట్టుకుంటోంది.
ఎన్నికలకు రెండేళ్ళ వ్యవధి ఉన్న వేళ లోకేష్ ఫుల్ ఫాం లోకి రావడం శుభ పరిణామంగా చూస్తున్నారు. ఇదే దూకుడుని చినబాబు కంటిన్యూ చేస్తే టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ లోకేష్ ని పట్టించుకోకపోయినా మంత్రులు ఆయనకు కౌంటర్లు ఇవ్వడం బట్టి చూస్తూంటే లోకేష్ బాణాలు సరిగ్గానే గుచ్చుకుంటున్నాయని అర్ధం చేసుకోవాలి.
మరి ఎన్నికల వేడి ఇంకా ముందు ముందు రాజుకునే సందర్భాన లోకేష్ మరెంతగా రాటుతేలతాడో చూడాలి. పెదబాబు చినబాబులు తమకు ఏమీ కారని లైట్ తీసుకుంటే మాత్రం అధికార పక్షం ఇబ్బందులు పడడం ఖాయమనే అంటున్నారు.