ఎమ్మెల్యే బొండా ..ఇద్దరు మహిళలకు అన్యాయం?

Update: 2018-02-24 16:51 GMT
అసలే బీజేపీ నేతలు ఇస్తున్న షాకులతో గిలగిలలాడుతున్న తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీ నేతల తీరు మరింత షాక్ తగిలేలా చేస్తోంది. ప్రధానంగా రాజధాని ప్రాంత నేతల కబ్జాలు - అక్రమాలు ఆ పార్టీపై అవినీతి - రౌడీయిజం ఇమేజిని బలపడేలా చేస్తున్నాయి. ఇప్పటికే భూ కబ్జాల వివాదాల్లో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమ మరో భూవివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నరు.
    
ఇప్పటికే ఫ్రీడమ్ ఫైటర్ సూర్యనారాయణకు చెందిన 50కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలతో తన భార్య పేరు మీద మార్చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బొండా ఉమా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫ్రీడం ఫైటర్‌ భూమి కబ్జాపై విచారణ జరుగుతున్న సమయంలో బొండా మరో వివాదంలో చిక్కుకోవడం చర్చనీయమవుతోంది.
    
పెనమలూరు డెవెలప్‌ మెంట్‌ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని ఇద్దరు మహిళలు జాయింట్‌  కలెక్టర్‌ ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి - లక్ష్మీ భవాని జాయింట్‌ కలెక్టర్‌ నకు ఫిర్యాదు చేశారు. భూమిని అప్పగించకపోతే చంపేస్తామంటూ బోండా ఉమ అనుచరులు పోలవరపు కిషన్‌ - వెంకట నరసయ్య బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  తమకు తెలియకుండానే తమ భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చామంటున్నారని - వాటికి వడ్డీ కట్టాలంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను కలిసి తమ బాధలను చెప్పుకొని న్యాయం చేమని కోరితే ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని వాపోయారు.
Tags:    

Similar News