3 రాజధానులను అడ్డుకునే టీడీపీ మాస్టర్ వ్యూహం

Update: 2020-01-22 06:13 GMT
శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకుంది. శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో టీడీపీ బలం సరిపోలేదు. కానీ మండలిలో మాత్రం వైసీపీకి బలం లేకపోవడం.. టీడీపీ ఎమ్మెల్సీల బలం ఉండడంతో మొదటిరోజు రూల్ 71ను తెరపైకి తెచ్చి 3 రాజధానులు, సీఆర్డీయే బిల్లును విజయవంతంగా అడ్డుకుంది.

నిన్న శాసనమండలిలో రూల్-71 నిబంధనలు తెరపైకి తెచ్చి 3 రాజధానుల బిల్లును అడ్డుకున్న టీడీపీ నిన్న రాత్రి అనూహ్యంగా ‘సెలెక్ట్ కమిటీ’ వ్యూహాన్ని సంధించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లులపై ఒత్తిడి తెస్తున్న వైసీపీ సర్కారుకు షాకిస్తూ ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ మండలి చైర్మన్ కు ఒక నోటీసులు అందించింది.మండలి చైర్మన్ టీడీపీ నేతే కావడంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ బిల్లులకు సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు తిరస్కరిస్తే మళ్లీ శాసనసభలో బిల్లు పై చర్చించి ఆమోదించి మండలికి పంపాల్సి ఉంటుంది. ఇలా జాప్యం చేయాలని టీడీపీ స్కెచ్ గీస్తోంది.

టీడీపీ కోరినట్టు శాసనమండలి చైర్మన్ ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపితే 3 రాజధానుల ఏర్పాటు మరింత జాప్యం అవుతుంది. సెలెక్ట్ కమిటీ పరిశీలనకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. అప్పటివరకూ బిల్లుల ఆమోదం నిలిచిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను చట్టం చేయలేదు. రాజధాని తరలింపునకు బ్రేకులు పడుతాయి. దీంతో ఈ సెలెక్ట్ కమిటీ వ్యూహాన్ని టీడీపీ ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు సభలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News