లోకేశ్ స్పీక్స్ : 800 కేసుల లెక్క తేల్చండి జగ‌న్ ?!

Update: 2022-04-29 13:38 GMT
ప్ర‌భుత్వాలు మారిన ప్ర‌తిసారీ న్యాయ వ్య‌వ‌స్థ‌కు స‌వాళ్లు కొత్త‌వి వ‌స్తాయి. పోలీసుల పరుగుల్లో మార్పు వ‌స్తుంది. నిందితుల నైజంలో మార్పు కూడా వ‌స్తుంది. నేరమ‌య ప్ర‌పంచంకు కొన్ని కొత్త దారులు దొరుకుతాయి. ఆవిధంగా వ్య‌వ‌స్థ వైఫ్య‌లం కార‌ణంగా పాల‌కుల వైఫ‌ల్యం కూడా ఓ విధంగా తోడ‌యి ఎన్నో చీక‌టి రోజుల‌ను బాధితులు గ‌డిపి ఆఖ‌రికి దిక్కుతోచ‌ని స్థితిలో కేసులు వాప‌సు తీసుకుంటున్న వైనాలూ ఉన్నాయి.

ఇదేమ‌ని అడ‌గ‌వ‌ద్దు ప్ర‌యివేటు పంచాయ‌తీల్లో లెక్క తేల‌ని జీవితాలు ఎన్నో ! క‌న్నీటి వ్య‌థ‌లు ఎన్నో ! ఇప్ప‌టిదాకా ఉన్న కేసుల సంఖ్య 800 (హ‌త్య‌, అత్యాచార ఘ‌ట‌న‌) .. వీటిని తేల్చ‌డం ఈ ప్ర‌భుత్వం ముందున్న బాధ్య‌త. అక్కచెల్లెమ్మ‌ల‌కు భ‌ద్ర‌త ముఖ్యం. జీవ‌న ప్ర‌మాణ మెరుగుద‌ల ముఖ్యం. ఇవే కోరుకుంటోంది ఈ ఆంధ్రావ‌ని !

విజ‌య‌వాడ అత్యాచార కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఆ చీక‌టి ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే గుంటూరు లో మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వచ్చింది. చీక‌టి వెలుగుల తార్లాట‌లో బాధితుల ఆక్రంద‌న‌లు మాత్రం అస్స‌లు వినిపించుకోవ‌డం లేదు పోలీసులు. వైఫ‌ల్యం కార‌ణంగానే ఇన్ని  జ‌రుగుతున్నా వ్య‌వ‌స్థ‌కు ఇవేవీ ప‌ట్ట‌డం లేదు.ద ఆడబిడ్డ‌ల‌ను ఆదుకోవాల్సిన కొన్ని స్వ‌తంత్ర సంస్థ‌లు మాత్రం పార్టీల నీడ‌లో బాగున్నాయి. మ‌రి! మ‌హిళా క‌మిష‌న్ ఆఫీసు ప్రాంగ‌ణాన 144 సెక్ష‌న్ ఎందుకు అన్న‌ది టీడీపీ లీడ‌ర్ అనిత సూటి ప్ర‌శ్న. జ‌గ‌న్  గారూ ! మా మొర వినండి.. డ‌బ్బులు కాదు శీలం ముఖ్యం.. ప్రాణం ముఖ్యం అని గగ్గోలు పెడుతున్న వైనం క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్న వైనం ఇవాళ అవశేషాంధ్ర‌ను క‌దిపి కుదిపేస్తున్న ప‌రిణామాల‌కు సంకేతిక.

వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఆంధ్రావ‌ని. యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించి, మ‌గువ‌ల మాన, ప్రాణాల‌ను కాపాడ‌డంలో త‌రుచూ విఫ‌లం అవుతున్నార‌న్న విమ‌ర్శ‌లూ వ‌స్తున్నాయి. హోం మంత్రి వ‌నిత కానీ అంత‌కుముందు ప‌నిచేసిన సుచ‌రిత కానీ పెద్ద‌గా  పాల‌న‌ను దార్లోకి తేలేక‌పోయారు అన్న‌ది మ‌రో వాద‌న. ఆ రోజు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ఉన్నా ఇప్పుడు ముఖ్య‌మంత్రి సొంత మ‌నిషే డీజీపీగా ఉన్నా బాధిత వ‌ర్గాల‌కు న్యాయం లేదు అన్న‌ది ఓ వాద‌న.
ఈ నేప‌థ్యంలో టీడీపీ లీడ‌ర్ లోకేశ్ ఏమ‌న్నారో చూద్దాం.

"చెల్లెలు రమ్యని అంతమొందించిన మానవ మృగం శశికృష్ణకి కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నాను. రమ్య హంతకుడిని శిక్షించాలని నేను ఆందోళనకి దిగితే...మాపై దాడులు చేసి రివర్స్ కేసులు బనాయించింది ఈ సర్కారు. వైకాపా అండతో చట్టాన్ని చుట్టం చేసుకుని  చెలరేగిపోతున్న నేరగాళ్లకి న్యాయస్థానం తీర్పు చెంపపెట్టు. వైఎస్ జగన్ రెడ్డి హయాంలో ఆడపిల్లలపై జరిగిన 800 హత్య, అత్యాచారాల కేసుల్లో బాధిత కుటుంబాలకి సత్వరమే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను."
Tags:    

Similar News