ఇసుక కొరత.. టీడీపీ ఆరోపణల్లో నిజమెంత?
ఏపీలో ఇప్పుడు ఇసుక కొరత.. దాని పర్యవసనాలను టీడీపీ పచ్చమీడియా - ప్రతిపక్ష చంద్రబాబు రెండుచేతులా అందిపుచ్చుకొని క్యాష్ చేసుకుంటున్నారు.. మరి ఈ విషయంలో నిజాలు చెప్పాల్సిన వైసీపీ నేతలు - ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోవడమే వైసీపీ శ్రేణులను నిరాశపరుస్తోందట...
చంద్రబాబు కాలుమోపితే నాశనమని అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటుండేవాడు.. 2004కు ముందు కూడా బాబు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో తీవ్రమైన కరువు కాటకాలతో కరువు కరాళనృత్యం చేసింది. వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోయారు. ఇక మొన్నటి 2014 పాలనలోనూ చంద్రబాబు గద్దెనెక్కాడు. మళ్లీ వరుణుడు ముఖం చాటేశాడు. బాబు హయాంలో ఐదేళ్లలో కరువు తీరింది లేదు.. వానలు పడింది లేదు.. ప్రాజెక్టులు నిండింది లేదు.
కానీ జగన్ వచ్చాడు.. ఏపీ కరువు తీరింది. నాడు వైఎస్ ను కరుణించిన వరుణుడు.. ఇప్పుడు ఆయన తనయుడి జగన్ పాలనను స్వాగతించినట్టున్నాడు. దీంతో పుష్కలంగా వానలు కురిశాయి. వాగులు - వంకలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ జలాశయాలు నిండి సముద్రంలోకి వరద పోటెత్తుతోంది. రాయలసీమ కరువు తీరింది. కరువుతో అల్లాడే అనంతపురంలో కూడా వరద ఏరులై పారింది.
అయితే వరద ప్రవాహానికి ఇప్పుడు వాగులు - వంకలు - నదులు అన్నీ నీటితో కళకళ లాడుతున్నాయి. అదే ఇప్పుడు ఏపీలో ఇసుక కొరతకు దారితీస్తోంది. ఇసుకను తీయాలంటే వాగులు - నదులు అన్నీ నీరు లేకుండా ఎండిపోయి ఉండాలి.కానీ ఈ వర్షాలకు నీరు పుష్కలంగా ఉండి ఇసుక తీయడం సాధ్యం కావడం లేదు. అదే ఏపీలో ఇసుక కొరతకు అసలైన కారణం.
అదే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంతా కరువు కావడంతో వాగులు - వంకలు - నదులు వట్టిపోయాయి. టీడీపీ నేతలంతా ఆ ఇసుకను మూడు పువ్వులు - ఆరు కాయలుగా అమ్ముకొని వ్యాపారం చేసుకొని లాభపడ్డారన్న విమర్శలున్నాయి..
ఇప్పుడు ఏపీలో ఇసుక కొరత రావడానికి ప్రధాన కారణం.. ఇసుక లభించే వాగులు - వంకలు నీటితో నిండిపోవడమే.. ఈ కీలకమైన కారణాన్ని ప్రజలకు వివరించకుండా వైసీపీ ప్రభుత్వం - నేతలు మిన్నకుండిపోతున్నారు.
అదే చంద్రబాబు అండ్ పచ్చబ్యాచ్ కు వరంగా మారుతోంది. వారు జగన్ ఇసుక పాలసీ వల్లే ఇదంతా అని కావాల్సినంత డ్యామేజ్ చేస్తున్నారు. వాగులు వంకల్లో నీరు ఉంటే ఇసుక ఎలా తీస్తారన్న కనీస సృహ లేకుండా బాబు - పచ్చమీడియా అభూతకల్పనలతో ప్రచారం చేస్తూ అప్రతిష్టపాలు చేస్తోంది. దీనిపై కౌంటర్ ఇయ్యాల్సిన వైసీపీ సర్కారు మాత్రం డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవడమే ఈ పరిస్థితికి కారణమవుతోంది.