• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బద్వేలులో బీజేపీని...

బద్వేలులో బీజేపీని ఆదుకున్న టీడీపీ

By - Tupaki Desk
Update: 2021-10-31 10:30 GMT
అవును మీరు చదివింది నిజమే. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీని టీడీపీ నేతలే ఆదుకున్నారు. ఇంతకీ బీజేపీని టీడీపీ ఏ విధంగా ఆదుకుంది ? ఏ విధంగా అంటే నియోజకవర్గంలోని 281 పోలింగ్ కేంద్రాల్లో చాలా చోట్ల బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలే కూర్చున్నారు. పోటీ చేయడం కాదు కదా కనీసం అన్నీ పోలింగ్ కేంద్రాల్లో కనీసం పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని దీనస్థితి బీజేపీది. అలాంటిది వైసీపీ అభ్యర్ధిని ఓడిస్తామని బీజేపీ నేతలు తొడగొడితే ఎవరన్నా నమ్ముతారా ?

తమ పరిస్థితి ఏమిటో కమలనాథులకు బాగా అర్ధమైపోయింది. అందుకనే పోలింగ్ కు పదిరోజులకు ముందే టీడీపీ నేతలతో మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నది కూడా రెండు పద్దతుల్లో. అదేమిటంటే మొదటిది పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటం, రెండోది ఓట్లు వేయించటం. ఎలాగూ పోటీలో టీడీపీ లేదు కాబట్టి తమ్ముళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారట. అందుకనే పోలింగ్ లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ తరపున పోలింగ్ ఏజెంట్లు కనిపించారు. విషయం ఏమిటంటే టీడీపీ స్ధానిక నేతలే కమలం పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నారు.

ఎలాగూ ఒప్పందం జరిగింది కాబట్టి కొన్నిచోట్ల తమ్ముళ్ళే బీజేపీ అభ్యర్ధికి ఓట్లు కూడా వేయించారని సమాచారం. కారణాలు ఏదైనా పోలింగ్ 69 శాతం నమోదైంది. 2019 ఎన్నికల్లో 77 శాతం నమోదైంది. టీడీపీ పోటీలో లేకపోయినా 69 శాతం పోలింగ్ నమోదైందంటే పోలింగ్ గట్టిగా జరిగినట్లే అనుకోవాలి. అంటే టీడీపీ ప్రభావం ఈ ఎన్నికలో ఏమీ లేదని అర్ధమవుతోంది. ఎందుకంటే టీడీపీకి సుమారు 30 శాతం ఓట్లున్నాయి. టీడీపీ పోటీలో లేనపుడు ఆ ఓట్లన్నీ ఎటు పడ్డాయి ? లేకపోతే అసలు పోలింగ్ కే రాలేదా ? పోలింగ్ కు దూరంగానే ఉండేట్లయితే 69 శాతం పోలింగ్ నమోదుకాదు.

కాబట్టి మెజారిటీ ఓట్లు వైసీపీకి పడుండాలి. అలాగే చెదురుమదురుగా కొన్ని బీజేపీకి కూడా పడుండాలని స్థానిక నేతలంటున్నారు. టీడీపీ సహకారం లేకపోతే బీజేపీకి అసలు ఓట్లు పడే అవకాశమే లేదంటున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 735 మాత్రమే. ఇప్పుడు అంతకుమించి ఓట్లు గనుక పోలైతే కచ్చితంగా టీడీపీ నేతలు బీజేపీకి సహకరించినట్లే అనుకోవాలి.  పోలింగ్ ఏజెంట్లనే పెట్టుకోలేని పార్టీకి ఎన్ని ఓట్లొస్తాయో 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లే సాక్ష్యం.

ఏదెలాగున్నా స్ధానిక నేతల మధ్య జరిగిన సర్దుబాటు రేపటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపకపోతుందా అని తమ్ముళ్ళు ఆశగా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ నేతల వైఖరి ఎలాగున్నా వచ్చే ఎన్నికల నాటికి కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అందరు చూస్తున్నదే. మరి చంద్రబాబు ఆశలు నెరవేరుతాయా ? లేదా అన్నది ఆసక్తిగా మారింది.
Tags:    
  • TDP 
  • Badvel 
  • BJP 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Copyright @2026

Powered by Blink CMS