మహిళా పోలీస్ ‘టిక్ టాక్’.. వీడియో వైరల్

Update: 2019-07-17 05:07 GMT
కాదేదీ టిక్ టాక్ కు అనర్హం అన్నట్టుంది పరిస్థితి. నిన్నటికి నిన్న ఖమ్మం కార్పొరేషన్ మహిళా ఉద్యోగులు కార్యాలయంలోనే టిక్ టాక్ వీడియోలు చేయడం దుమారం రేపింది. ప్రజలు వినతులకు వచ్చినా బిజీగా ఉన్నామని చెప్పి వీరు చేసిన ఘనకార్యానికి కమిషనర్ సీరియస్ అయ్యి వారికి స్థానమార్పిడి చేశాడు.

ఇప్పుడు ఈ టిక్ టాక్ మోజులో మహిళా పోలీసులు కూడా పడడం విశేషం. డ్యూటీలో ఉన్న మహిళా పోలీసులు సరదాగా బీచ్ లో టిక్ టాక్ వీడియో తీస్తూ స్టెప్పులేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. యూనిఫామ్ లో ఉండి ఇలా రోమాంటిక్ పాటకు స్టెప్పులు వేసిన మహిళా పోలీసుల తీరు వివాదాస్పదమైంది.

తమిళనాడులోని కడలూరు రిజర్వ్ పోలీస్ బెటాలియన్ కు చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సమీపంలోని బీచ్ లో ఓ తమిళ పాటకు స్టెప్పులేసి టిక్ టాక్ లో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశించారు.



Full View
Tags:    

Similar News