భారత్ - పాక్ సీజ్ ఫైర్ కు చైనా మధ్వర్తిత్వం వహించిందంట!

భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడో దేశం కానీ, మూడో వక్తి ప్రమేయం కానీ లేదని భారత్ పదే పదే చెబుతున్నా.. నవ్వి పోదురు గాక అన్నఛందాన్న ట్రంప్ ప్రపంచ వేదికలపై చెప్పించే చెబుతున్నారు.;

Update: 2025-12-31 06:30 GMT

ఈ ఏడాది మే లో భారతదేశం - పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన మారణహోమానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు కొనసాగింపుగా.. ఇరు దేశాల మధ్య మినీ యుద్ధం జరిగింది! అనంతరం కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్ నుంచి రావడం.. అందుకు భారత్ సరేననడం తెలిసిందే. అయితే.. ఈ సీజ్ ఫైర్ కు కారణం తానే అని ట్రంప్ ఇప్పటి వరకూ చెప్పుకోగా.. ఇప్పుడు చైనా లైన్ లోకి వచ్చింది.

అవును... ఈ ఏడాది మే నెలలో రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలైన భారత్ - పాక్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పాక్ నుంచి వచ్చిన సీజ్ ఫైర్ విన్నపాన్ని భారత్ మన్నించి, అంగీకరించింది. అయితే.. అందుకు కారణం తానే అని.. వాణిజ్యం పేరు చెప్పి కాల్పుల విరమణకు ఇరు దేశాలను తానే ఒప్పించానని.. ఇది తన ఘనత అని.. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనడానికి ఇది కూడా ఒక కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.

భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడో దేశం కానీ, మూడో వక్తి ప్రమేయం కానీ లేదని భారత్ పదే పదే చెబుతున్నా.. నవ్వి పోదురు గాక అన్నఛందాన్న ట్రంప్ ప్రపంచ వేదికలపై చెప్పించే చెబుతున్నారు. అలా చెప్పడంలో హాఫ్ సెంచరీ కూడా దాటేశారని అంటున్నారు. ఈ సమయంలో చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా... భారత్ - పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది తామే అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చెప్పుకొచ్చారు.

తాజాగా... బీజింగ్‌ లో జరిగిన అంతర్జాతీయ పరిస్థితి, చైనా విదేశీ సంబంధాలపై జరిగిన సింపోజియంలో మాట్లాడిన వాంగ్... ఈ సంవత్సరం స్థానిక యుద్ధాలు, సరిహద్దు ఘర్షణలు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఎప్పుడూ లేనంతగా పెరిగాయని.. భౌగోళిక రాజకీయ అల్లకల్లోలం వ్యాప్తి చెందుతూనే ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో శాశ్వత శాంతిని నిర్మించడానికి తము ఒక లక్ష్యం, న్యాయమైన వైఖరి తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో... ఉత్తర మయన్మార్, ఇరాన్ అణు సమస్య, పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య సమస్యలు, ఇటీవల కంబోడియా - థాయిలాండ్ మధ్య వివాదంలో తాము మధ్యవర్తిత్వం వహించామని వాంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే సందట్లో సడేమియాలాగా... పాకిస్తాన్ - భారతదేశం మధ్య ఉద్రిక్తతలు తగ్గించే విషయంలోనూ తామే మధ్యవర్తిత్వం వహించామని చైనా విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో.. వాషింగ్టన్ క్రెడిట్ గేమ్ ఆగినట్లు కనిపిస్తుంది.. ఇప్పుడు బీజింగ్ ది మొదలైనట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య మే నెలలో మినీ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అన్ని రంగాల్లోనూ భారత్ ది పైచేయిగా నిలిచిన పరిస్థితి. దీంతో... బెదిరిన పాక్.. సీజ్ ఫైర్ కోసం భారత్ ను రిక్వస్ట్ చేసింది. ఈ సమయంలో రెండు దేశాల డీజీఎంఓ లు 2025 మే 10న మధ్యాహ్నం ఫోన్ కాల్ ద్వారా ఒక అవగాహనకు వచ్చి.. సీజ్ ఫైర్ కు అంగీకరించారని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదే సమయంలో... భారత్ - పాక్ మధ్య విషయాల్లో మూడవ పక్షం జోక్యానికి అవకాశం లేదని న్యూఢిల్లీ పదే పదే పేర్కొంది. ఇది దశాబ్ధాలుగా తమై వైఖరి అని నొక్కి చెప్పింది. అయితే.. దీనిపై క్రెడిట్ తీసుకునే పనిలో నిన్నటివరకూ ట్రంప్ బిజీగా ఉంటే.. ఇప్పుడు ఆ పని చైనా తీసుకున్నట్లు కనిపిస్తుంది. కాగా.. ఈ వార్ లో చైనా, టర్కీ ఆయుధాలను పాక్ వినియోగించిందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News