తమిళులపై హిందీ.. కనిమొళి మళ్లీ ఫైర్

Update: 2020-08-22 23:30 GMT
ఇటీవల కేరళలో జరిగిన విమాన ప్రమాదం సంఘటన పరిశీలించేందుకు వెళ్లిన డీఎంకే ఎంపీ కనిమొళిని ‘హిందీ రాకపోవడంతో మీరు భారతీయులేనా?’ అని ఓ ఉత్తరభారత అధికారి ప్రశ్నించడం వివాదాస్పమైంది. ఆ వివాదం మరిచిపోకముందే మరో సారి అదే రిపీట్ అయ్యింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయూష్ విభాగం సెక్రెటరీ రాజేష్ కోతేచ  ఆన్ లైన్ సమావేశంలో మాట్లాడారు. హిందీ భాష తెలియని వాళ్లు సమావేశం నుంచి వైదొలిగాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు.

కేంద్ర కార్యదర్శి రాజేశ్ తీరుపై డీఎంకే నేతలు, తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళులపై కేంద్రం హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు.

హిందీ భాష రాదని తమిళులని అవమానిస్తున్నారని.. సెక్రెటరీ రాజేష్ పై కేంద్రం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కనిమొళి డిమాండ్ చేశారు.
Tags:    

Similar News