దానం నాగేందర్ కాంగ్రెస్ నేతా? బీఆర్ఎస్ నేతా?

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం కాక రేపుతున్న సంగతి తెలిసిందే. ఐదుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక ప్రకటన చేయగా...మరో ఐదుగురిపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.;

Update: 2026-01-02 10:35 GMT

తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం కాక రేపుతున్న సంగతి తెలిసిందే. ఐదుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక ప్రకటన చేయగా...మరో ఐదుగురిపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ ఐదుగురిపై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. ఆ ఐదుగురిలో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కూడా ఉన్నారు. అయితే, ఆల్రెడీ దానం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో, ఆయన పార్టీ మారారని క్లియర్ గా తెలిసిపోతుంది. దీంతో, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని దానం స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే దానం తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మూసీ నది ప్రక్షాళనపై చర్చ జరుగుతున్న సందర్భంగా దానం మాట్లాడారు. అయితే, ఆ సమయంలో సంబంధింత శాఖా మంత్రి అటెన్షన్ పే చేయడం లేదంటూ దానం చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడైనప్పటికీ, కాంగ్రెస్ కు మద్దతిచ్చిన దానం...మంత్రిపై అలా అసహనం వ్యక్తం చేయడం విశేషం. దీంతో, దానం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, దానం కాంగ్రెస్ లో ఉండక తప్పని పరిస్థితి అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, దానం నాగేందర్‌కు కాంగ్రెస్ హై కమాండ్ నుంచి బలమైన హామీ లభించిందని, అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఒకవేళ దానంపై వేటు పడి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించుతామని అధిష్టానం నుంచి హామీ వచ్చిందట. ఒకవేళ, దానంకు టికెట్ రాకపోతే ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News