• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ ఫోటోలోని నవ్వులు.....

ఈ ఫోటోలోని నవ్వులు.. ఐక్యత టీ కాంగ్రెస్ లో ఎప్పటికి వచ్చేను?

By - Tupaki Desk
Update: 2021-08-17 03:42 GMT
కలిసి ఉంటే కలదు సుఖం అన్న సామెతను ఎప్పటికి అర్థం చేసుకోలేని పార్టీగా తెలంగాణ కాంగ్రెస్ ను చెప్పాలి. నిత్యం అధిపత్య పోరు కోసం అంతర్గతంగా సాగే కుమ్ములాటలు ఆ పార్టీని వెంటాడుతూనే ఉంటాయి. ఎవరు నాయకత్వం వహించినా.. వారి నాయకత్వాన్ని కొందరు వ్యతిరేకించటం.. వారికి సహకారం అందించకపోవటం లాంటి తీరుతో పార్టీని అంతకంతకూ బలహీనం చేసే వైనం టీ కాంగ్రెస్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. చేతిలో అధికారం లేకున్నా.. పార్టీలో అధిక్యత కోసం ఆ పార్టీ నేతలు వ్యవహరించే తీరు.. కదిపే పావులు చూస్తే.. ఈ జన్మకు పార్టీ బాగుపడదా? అన్న సందేహాలు కలిగేలా పరిస్థితులున్నాయని చెప్పాలి.

ఈ మధ్యనే ఇంద్రవెల్లిలో రేవంత్ నిర్వహించిన భారీ సభకు పలువురు ముఖ్యనేతలు డుమ్మా కొట్టటం తెలిసిందే. అలాంటి నేతల్లో కొందరు తాజాగా హైదరాబాద్ లోని మధుయాష్కీ నివాసానికి వచ్చారు. నవ్వులు చిందించారు. తమ మధ్య ఎలాంటి అరమరికలు లేవన్నట్లుగా వ్యవహరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెలితే.. రాయచూర్ లోని జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి వెళుతూ హైదరాబాద్ లో ఆగారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కమ్ వర్కింట్ కమిటీ సభ్యుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా.

అదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కూడా విడిగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ ముగ్గురు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మదుయాష్కీ గౌడ్ నివాసానికి చేరుకున్నారు. వీరిని  కలిసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు వెళ్లారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు.. పొన్నాల.. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.

నవ్వులు చిందిస్తూ.. విభేదాల్ని దాచి పెట్టేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు వచ్చినప్పుడు కనిపించే సామరస్యం.. ఐక్యత లాంటివి పార్టీలో సహజసిద్ధంగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఫోటోలు తీసుకునేటప్పుడు ప్రదర్శించే ఐక్యత.. అధికారపక్షంపై పోరాడే విషయంలోనూ కనిపిస్తే ఎంత బాగుండన్న మాట పార్టీ నేతల నోటి నుంచి రావటం గమనార్హం
Tags:    
  • Telangana Congress Committee chief 
  • Enumula Revanth Reddy 
  • Huzurabad 
  • Political News 
  • Breaking News 
  • Latest News 
  • bypolls 
  • revanth reddy 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS