మోడీ సర్కారులో నెంబర్ త్రీ ఎవరంటే..?

Update: 2015-11-25 09:46 GMT
మోడీ సర్కారులో నెంబర్ వన్ మోడీనే. మరి.. నెంబర్ టూ అన్న వెంటనే రాజ్ నాథ్ సింగ్ గుర్తుకు వస్తారు. అంతవరకూ ఓకే. మరి.. నెంబర్ త్రీ ఎవరంటే..? వెంటనే సమాధానం చెప్పలేరు? అయినా.. నెంబర్ వన్.. టూ ఉంటారు కానీ నెంబర్ త్రీ కూడా ఉంటారా? అని సందేహం రావొచ్చు. కానీ.. నెంబర్ త్రీ కూడా సిద్ధంగానే ఉంటారు.

ఇంతకీ ఈ నెంబర్ టూ.. నెంబర్ త్రీతో పనేంటన్న డౌట్ వచ్చిందా? అక్కడికే వస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు వెళితే.. ఇన్ ఛార్జ్ బాధ్యతలు ఎవరు చేపడతారు? ఇంకెవరు రాజ్ నాధ్ సింగే. మరి.. ఒకేసారి మోడీ.. రాజ్ నాధ్ లాంటి వారు విదేశాలకు వెళ్లే పరిస్థితే వస్తే.. ఇన్ ఛార్జ్ ప్రదాఇన బాధ్యతల్ని ఎవరు నిర్వర్తిస్తారన్న విషయానికి ఎవరూ ఊహించని సమాధానం లభిస్తుంది. అందరూ.. రాజ్ నాధ్ తర్వాత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేరు ప్రస్తావిస్తారు. కానీ.. నెంబర్ వన్.. టూ దేశంలో లేనప్పుడు ఇన్ ఛార్జ్ ప్రధాని బాధ్యతల్ని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ నిర్వర్తిస్తున్నారు.

ఇటీవల 21న మోడీ విదేశీ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందే రాజ్ నాధ్ సింగ్ సైతం (నవంబరు 18) విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో.. ఇన్ ఛార్జ్ బాధ్యతల్ని ఎవరు నిర్వర్తిస్తారన్న ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ బాధ్యతల్ని సుష్మా స్వరాజ్ కు అప్పగించారు. ఇన్ ఛార్జ్ ప్రధానిగా సుష్మా మూడు రోజులు బాధ్యతల్ని నిర్వర్తించారు. రాజ్ నాధ్ విదేశీ పర్యటన  నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇన్ ఛార్జ్ బాధ్యతల్ని సుష్మా.. రాజ్ నాధ్ కు అప్పగించారు. బుధవారం విదేశీ పర్యటన ముగించుకు వచ్చాక మోడీకి బాధ్యతలు అప్పగించేసి రాజ్ నాధ్ ఇన్ ఛార్జ్ నుంచి తప్పుకుంటారు. సో.. మోడీ సర్కారులో నెంబర్ వన్ మోడీ.. నెంబర్ టూ రాజ్ నాధ్.. నెంబర్ త్రీ సుష్మా స్వరాజ్ అన్న విషయం తాజాగా తేలిపోయింది. ఇక.. నెంబర్ త్రీ ఎవరన్న విషయానికి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేనట్లే.
Tags:    

Similar News