బీజేపీ ఐటీసెల్ లో వెధవలు .. సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు !
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ..దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్న నేత. అలాగే వివాదాస్పదమైన నేతగా ఈయనకి గుర్తింపు ఉంది. ఏ విషయంలో అయినా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో ఈయనకి సాటి ఎవరు రాలేరు. ఒక్కసారి నోరు తెరిస్తే .. తన , మన అన్న భేదాభిప్రాయం ఉండదు. ఎవరైనా డోంట్ కేర్ అన్నట్టుగా అయన వ్యాఖ్యలు ఉంటాయి. తనను ఇబ్బంది పెడితే....వారెంతటి వారైనా సరే ఒక పట్టాన విడిచి పెట్టే స్వభావం ఆయనది కాదు. అలాగే సొంత పార్టీ నేతలని సైతం విడిచిపెట్టే స్వభావం కాదు. ఎవరిపైనైనా విరుచుకుపడుతుంటారు.
ఇక తాజాగా సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్న కొందరు సొంత పార్టీకి చెందిన వారిపై తీవ్రంగా మద్దిపడ్డారు. వారిపై తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. బీజేపీ ఐటీ సెల్ లో వెధవలు ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ఐటీ సెల్ వెధవల వ్యాఖ్యలకు బీజేపీ ఎలా బాధ్యత వహించదో.. నాపై దూషణలకు దిగేవారిపై నా అభిమానులు కోపంతో చేసే వ్యక్తిగత దాడులకు కూడా నేను అలాగే బాధ్యత వహించను’ అని తేల్చి చెప్పారు.
వ్యక్తి గత విమర్శలకి దిగుతున్నవారిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. ఒక మాలవీయ క్యారెక్టర్ రోత పుట్టించే గొడవలకు సృష్టిస్తున్నాడు. మన పార్టీ మర్యాదరామన్నలదే కాని రావణాసురులది, దుశ్శాసనులది కాదు కదా’ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా సుబ్రమణ్యస్వామి జేఈఈ-నీట్ పరీక్షలపై కూడా బీజేపీ వైఖరితో విభేదించారు. పరీక్షలపై మోడీ ఆలోచననూ ఆయన తప్పుపట్టారు. చైనా దురాక్రమణ పట్ల ప్రభుత్వ వైఖరిని కూడా విమర్శించారు. అప్పటి నుంచి కొందరు స్వామిపై సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు. ఇది బీజేపీ ఐటీ సెల్ చేసినట్టు స్వామి ఆరోపిస్తున్నారు.