బీజేపీ జాబితాలో డైనమిక్ లీడర్ పేరు మిస్
అయితే ఆ సీట్లలో ఎక్కువ శాతం బీజేపీ గెలిచేవి కావని అనుకూలం కాదని అన్నామలై ఈ మధ్యనే ఆగ్రహం వ్యక్తం చేశారు.;
తమిళనాడుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన వారు, కీలక నాయకుడిగా ఆయన పేరు చెబుతారు. అయితే ఆయనకు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కలేదంటే ఆశ్చర్యమే మరి. కమలం పార్టీ ఎందుకిలా చేసింది అన్నదే చర్చ. ఇక ఆయన ఎవరూ అంటే ఒకరు తమిళనాడు లో కాషాయనికి కిక్ ఇచ్చే స్థాయిలో జనంలో పార్టీని తీసుకెళ్ళిన అన్నామలై. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు కానీ హైకమాండ్ మాత్రం ప్రచారం చేయండి మీరు అంటూ టికెట్ లేదని చెప్పేసింది.
మొత్తం 27 మందితో :
తమిళనాడులో అన్నా డీఎంకేతో పొత్తులో భాగంగా బీజేపీకి 27 మంది ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు. అయితే ఆ సీట్లలో ఎక్కువ శాతం బీజేపీ గెలిచేవి కావని అనుకూలం కాదని అన్నామలై ఈ మధ్యనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి రిటార్టు అన్నట్లుగా ఏకంగా ఆయన సీటుకే ఎసరు పెట్టేశారు అని అంటున్నారు. ఇక కేంద్రంలో మంత్రిగా ఉన్న ఎల్.మురుగన్కు అవనాషి సీటు ఇవ్వడం విశేషం. అలాగే బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా ఉన్న వనతి శ్రీనివాసన్ కు కోయంబత్తూర్-నార్త్ ని ఇచ్చి ఆశ్చర్యపరచారు. అలాగే అన్నా మలైని తీసేది రాష్ట్ర బీజేపీ చీఫ్ గా కొత్తగా నియమించిన నైనార్ నాగేంద్రన్ కు సాత్తూర్ అసెంబ్లీ టికెట్ కేటాయించారు ఇలా కేంద్ర బీజేపీ నేతలు తమదైన శైలిలో ఈ ఎంపిక చేశారు. గెలుపు గుర్రాలు అనుకుని చాలా మందికి టికెట్లు ఇచ్చారు కానీ కీలకమైన నాయకుడిగా ఉన్న అన్నామలైకు టికెట్లు ఇవ్వకపోవడం మీదనే అంతటా చర్చ సాగుతోంది.
ప్రచారం చేస్తానంటున్నారు :
అయితే తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించక పోవడం పట్ల లోపల అసంతృప్తి ఉందో ఆవేదన ఉందో తెలియదు కానీ అన్నా మలై మాత్రం బయట పడడం లేదు, నిజానికి ఆయన కోయంబత్తూర్, ఈరోడు సీట్లు మీద ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. వాటిని పొత్తులో బీజేపీకి ఇవ్వలేదని అన్నా డీఎంకే మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుదు ఆయనకు పోటీ చేసే చాన్స్ రాకపోవడం వెనక అన్నాడీంకే పెద్దలు పావులు కదిపారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే తనకు టికెట్ ఇవ్వకపోయినా ఎన్డీఏ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను అని ఆయన అంటున్నారు.
ఓకే అన్న తమిల్ సై :
మరో వైపు చూస్తే మైలాపుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై తెలంగాణా మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె కోరుకున్నది ఒక సీటు అయితే దక్కింది వేరేది అన్న చర్చ సాగుతోంది అయితే తమిళ్ సై మాత్రం ఎన్ డీయే కూటమి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. తనకు కేటాయించిన సీటుకి ఓకే అన్నారు. చెన్నై తనకు కొత్త ప్రదేశం కాదని తమిళసై చెప్పడం విశేషం. ప్రజల నుంచి గెలిచి చట్ట సభలకు రావాలనే తాము గవర్నర్ పదవికే రాజీనామా చేసి వచ్చాను అని గతాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ ఎవరు కష్టపడతారో వారికే టికెట్లు ఇస్తుందని ఆమె చెప్పారు.
ఇరవై రోజులే ఉంది :
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలల పోలింగ్ కి కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్ డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే 169 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో, పీఎంకే 18, ఏఎంఎంకే 11, తమిళ్ మానిలా కాంగ్రెస్ 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ నెల 23న ఒకే విడతలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 4న రానున్నాయి.