గుండె గుభేల్ మనిపిస్తున్న కడప జిల్లా గోతులు

Update: 2015-11-25 07:23 GMT
ఎక్కడా లేని విధంగా కడప జిల్లా ప్రజలు విపరీతమైన టెన్షన్ కు గురి అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండటం నాయినోరి పల్లెలో పలు చోట్ల భూమి కుంగిపోయి.. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటం తెలిసిందే. ఈ గుంతలు భారీగా ఉండటం.. ఊళ్లోని పలు చోట్ల ఏర్పడటంతో తీవ్ర భయాందోళనలు గురయ్యాయి.

తాజాగా ఆ ప్రాంతాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు పరీక్షలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన శాస్త్రవేత్తలు బృందం పర్యటించనుంది. ఇదిలా ఉంటే.. నాయినోరి పల్లెలో మాదిరే కడపజిల్లాలోని వేంపల్లిలోనూ తాజాగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడటం జనాల్ని భయపెట్టేస్తుంది. దాదాపు 20 అడుగుల లోతుగా పడిన గుంతను చూసిన ప్రజలు బేజారెత్తి పోతున్నారు. వేంపల్లిలో పడిన గుంతల్ని రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు.
Tags:    

Similar News