• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వాటర్ వార్ : భేటీ కావడం...

వాటర్ వార్ : భేటీ కావడం కుదరదు .. మరో లేఖ రాసిన తెలంగాణ !

By - Tupaki Desk
Update: 2021-08-09 07:19 GMT
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. సోమవారం గోదావరీ రివర్ బోర్డు సమావేశానికి హాజరు కాలేమని స్పష్టం చేసింది. న్యాయ సంబంధిత, ఎన్జీటీ, సుప్రీంకోర్టు కేసుల నేపథ్యంలో హాజరుకాలేమని లేఖలో పేర్కొంది. సమావేశానికి మరో తేదీని ప్రకటించాలని కృష్ణా, గోదావరి బోర్డుని తెలంగాణ సర్కార్ కోరింది. ఈ మేరకు రెండు బోర్డులకు మరోమారు విడి విడిగా లేఖలు రాసింది. ఆదివారం కూడా బోర్డులకు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ మళ్లీ లేఖలు రాసింది. తెలంగాణ లేఖల నేపథ్యంలో సోమవారం నాటి బోర్డుల ఉమ్మడి భేటీ ఉంటుందా.. లేదా.. అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ భేటీకి సైతం రాలేమని తెలంగాణ చెప్పినా సమావేశం కొనసాగించాయి.

ఇదే రీతిన బోర్డులు ముందుకు సాగుతాయా, లేక తెలంగాణ వినతి నేపథ్యంలో వెనక్కి తగ్గుతాయా అన్నది ఉత్కంఠగా మారింది.  కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గత నెల 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ లో పేర్కొన్న అంశాలే అజెండాగా ఈనెల 9న భేటీ నిర్వహిస్తామని తెలుగు రాష్ట్రాలకు రెండు బోర్డులు 4న లేఖలు రాశాయి. అయితే దీనిపై తెలంగాణ వెంటనే స్పందించింది. అదే రోజు తమకు కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణపై విచారణ, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ఎన్జీటీ ముందు విచారణకు రానుందని, ఈ నేపథ్యంలో భేటీలకు హాజరు కాలేమని తెలిపింది.

అయినా పట్టించుకోని బోర్డులు, గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌ అవస్థీ రాసిన లేఖలను ప్రస్తావిస్తూ, 30 రోజుల్లో నోటిఫికేషన్‌ అమలు చేసేలా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాల్సి ఉన్న దృష్ట్యా ఈ భేటీకి రావాలని లేఖలో కోరాయి. అయితే ఈ లేఖల అంశాలతో పాటు, గెజిట్‌లోని ఇతర అంశాలపై శని, ఆదివారాల్లో సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇరిగేషన్‌ ఇంజనీర్లకు పలు అంశాలపై మార్గదర్శనం చేశారు. ఆయన సూచన మేరకు ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్‌ ఆదివారం బోర్డులకు వేర్వేరుగా లేఖలు రాశారు. కోర్టు కేసుల విచారణ దృష్ట్యా 9న భేటీకి రాలేమని, అందరికీ ఆమోదమైన మరో రోజున భేటీ నిర్వహిస్తే రాష్ట్ర ఇంజనీర్లు హాజరై, వారి అభిప్రాయాలు వెల్లడిస్తారని లేఖల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో పరిపాలన పరమైన అంశాలే కాకుండా, నీటి వినియోగానికి సంబంధించిన అంశాలను సైతం అజెండాలో చేర్చాలని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో కోరారు.

అయితే దీనిపై బోర్డులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది సోమవారం వెల్లడి కానుంది. ఏపీ మాత్రం ఈ భేటీలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  బోర్డుల భేటీ వాయిదా కోరుతున్న తెలంగాణ కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. రెండ్రోజుల పాటు వరుసగా దీనిపై చర్చించిన సీఎం బోర్డులకు సమగ్ర అజెండా అంశాలతో లేఖలు రాయాలని, వాటిని బోర్డుల్లో చర్చించేలా పట్టుబట్టాలని ఇంజనీర్లకు సూచించారు. దానికి అనుగుణంగా రావాల్సిన వాటాలు దక్కించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఇంతవరకు కొనసాగుతున్న కృష్ణా జలాల్లో ఉన్న నీటి వాటాల నిష్పత్తిని మార్చి దాన్ని చెరిసగం పంచాలని, ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపేలా చర్యలతో పాటు, పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా తరలిస్తున్న నీటి తరలింపును అడ్డుకునేలా వాదనలు సిద్ధం చేయాలని చెప్పినట్లు సమాచారం. వీటితో పాటే బచావత్‌ అవార్డు ప్రకారం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాపై గట్టిగా వాదనలు వినిపించాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది
Tags:    
  • andhrapradesh 
  • telangana 
  • krishna river 
  • projects 
  • rains 
  • floods 
  • ap govt 
  • ys jagan 
  • kcr 
  • water crisis 
  • water war 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS