ఏపీ హైకోర్టుకు రాజధాని పై వివరణ ఇచ్చిన కేంద్రం..ఏంటంటే?

Update: 2020-08-06 08:30 GMT
ఏపీలో ఒకే రాజధాని ఉండాలా? లేదా మూడు రాజధానుల ఉండాలనే చర్చ వాడివాడీగా జరుగుతోంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజధానిపై ఏపీ హైకోర్టుకు ఇచ్చిన వివరణ ఆసక్తిని రేపుతోంది..

రాజధానుల విషయంలో కేంద్రానికి నిర్ణయాధికారం లేదని స్పష్టం చేసే ఆఫిడవిట్ ను గురువారం హైకోర్టులో దాఖలు చేసింది. చట్టసబల్లో సభ్యుల మధ్య జరుగాల్సిన చర్చ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని పేర్కొంది.

ఈమేరకు కేంద్రం హోంశాఖ, రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్రం పరిధిలోనిదా, రాష్ట్రం పరిధిలోనిదా అనే అంశంపై దాఖలైన పిటిషన్ పై తాజాగా కేంద్రం హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో రాజధానుల విషయంలో తమ జోక్యం ఉండబోదని కేంద్రం స్పష్టం చేసినట్లయింది.
Tags:    

Similar News