సచిన్ ఇంట పెళ్లి సందడి... ప్రత్యేక ఆహ్వానం ఎవరికంటే..!
ఈ సమయంలో ఇరు కుటుంబాలు కలిసి.. అనంతరం అర్జున్ - సానియాతో కలిసి ప్రధానితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు.;
క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆయన తనయుడు అర్జున్ టెండుల్కర్ కు పెళ్లి నిశ్చయమైంది. తన స్నేహితురాలు సానియా చందోక్ ను అతడు వివాహం చేసుకోబోతున్నాడు. వీరి వివాహం ముంబయి మహానగరంలో మార్చి 5న జరగనుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి సచిన్ టెండుల్కర్ ఆహ్వాన పత్రికను అందజేసి, ప్రత్యేకంగా ఆహ్వానించారు!
అవును... మార్చి 5న మాస్టర్ బాస్టర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కుమరుడు అర్జున్ - సానియా ల వివాహం జరగనుంది. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహ వేడుకకు రావాలంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోడీకి సచిన్ టెండుల్కర్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సమయంలో.. సానియా చందోక్ తల్లితండ్రులు కూడా వెంట రాగా వారందరినీ ప్రధాని ఆత్మీయంగా పలకరించారు.
ఈ సమయంలో ఇరు కుటుంబాలు కలిసి.. అనంతరం అర్జున్ - సానియాతో కలిసి ప్రధానితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా.. కాబోయే దంపతులను మోడీ ఆశీర్వదించారు. కాగా... ముంబయికి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలే సానియా చందోక్. ఆమె ముంబైలో మిస్టర్ పాస్ పెట్ స్పా సంస్థను నడుపుతున్నారు.
అంతకంటే ముందు సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబును సచిన్ టెండుల్కర్ కలిశారు. దీనికి సంబంధించిన విషయాన్ని చంద్రబాబు ఎక్స్ వేదికగా పంచుకోగా.. ఆ పోస్టుకు సచిన్ స్పందించారు. ఈ సందర్భంగా... "ఢిల్లీ విమానాశ్రయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ను కలిశాను.. ఆయనను కలవడం ఆనందంగా ఉంది" అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సచిన్ తో ఉన్న ఫోటోను పంచుకున్నారు.
ఈ పోస్టుకు స్పందించిన సచిన్ టెండుల్కర్... చంద్రబాబుని కలవడం గొప్ప అనుభూతి అని చెబుతూ.. మీకు ఆనందం, మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.