శ్రీ వెంకటేశ్వరుడు...ప్రపంచ కుబేరుడు

ఇక తిరుమల కొండ మీద స్వామి వారి కార్యక్రమాలు సవ్యంగా సాగేలా చూసేలా ఏర్పాటు చేసిన వారిలో బ్రిటిష్ వారు కూడా ఉన్నారు.;

Update: 2026-02-10 18:21 GMT

తిరుమల తిరుపతి లో వెలసిన స్వామి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన కలియుగం మొత్తం భువిలోనే ఉంటూ భక్తుల మొక్కులను తీరుస్తూ ఇలనే వైకుంఠంగా మార్చేందుకు అవతరించారు అని పురాణ గాధలు చెబుతాయి. లక్ష్మీ దేవిని వెతుక్కుంటూ వచ్చిన స్వామి వారి పద్మావతిని పరిణయమాడి ఆ తరువాత అలివేలు మంగ పద్మావతిలతో కలసి తిరుమల కొండ మీదనే శిలగా మారి భక్తులకు వర ప్రసాదిగా మారారు అన్నది కూడా పురాణాలు చెబుతున్నాయి.

తెలియని ఎన్నో రహస్యాలు :

శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత మహిమాన్వితుడు. ఆయనకు ముడుపులు మొక్కులు చెల్లించిన వారిని కాచే ఆపద్బాంధవుడిగా ఉంటారు. ఆపదల నుంచి రక్షించే ఆపదమొక్కులవాడిగా కూడా కటాక్షిస్తారు. తిరుమల గురించి తెలియని ఎన్నో దేవ రహస్యాలు పురణాలలో ఉన్నాయి. స్వామి వారు కొండను తానే స్వయంగా ఎంచుకుని స్వయంభువుగా వెలిసారు. స్వామి వారి దగ్గర నిలబడిన ఏ భక్తుడైనా మనసు మొత్తం ఆలోచనలు మొత్తం ఒక్కసారిగా నిలిచిపోయి ఆయన వైపు తదేకంగా చూస్తూ ఉండిపోతారు. ఎన్నో కోరికలు చెప్పుకుందామని వెళ్ళినవారు ఆ రూపాన్ని చూస్తూ అన్నీ మరచి పోవడం అంటేనే స్వామి మహిమ అని అంటారు. అయితే దేవ దేవుడికి భక్తుల మదిలో ఏమి ఉందో తెలియని విషయం కాదని అంటారు.

బ్రిటిష్ వారు సైతం :

ఇక తిరుమల కొండ మీద స్వామి వారి కార్యక్రమాలు సవ్యంగా సాగేలా చూసేలా ఏర్పాటు చేసిన వారిలో బ్రిటిష్ వారు కూడా ఉన్నారు. 1870 ప్రాంతంలో బ్రిటిష్ అధికారులు నేరుగా కొండ మీదకు వచ్చి ప్రత్యక్షంగా స్వామి మహిమలను తెలుసుకుని అచ్చెరువందారు. ఆ మీదట హిందూ ధర్మం ప్రకారం అక్కడ అన్ని ఆస్తిక కార్యక్రమాలు సజావుగా జరిగేలా బ్రిటిష్ పాలకులు కూడా తగిన చొరవ చూపించారు. అంతకు ముందు కూడా ఈ దేశాన్ని ఎవరు పాలించినా విదేశీయులు దండయాత్రలు చేసినా కూడా స్వామి వారి విషయంలో మాత్రం అంతా ఆస్తికత్వానికి పెద్ద పీట వేస్తూ వచ్చారు.

ప్రపంచం మొత్తంగా :

తిరుమల అంటే ప్రపంచంలోనే అతి పెద్ద హైందవ పుణ్య క్షేత్రంగా ఉంది. భక్తులు కోటానుకోట్లు ఉన్నారు. స్వామి వారిని దర్శించుకునే వారిలో కేవలం హిందువులు మాత్రమే ఉంటారు అనుకుంటే పొరపాటు. ఇతర మతస్థులు, విదేశీయులు ఎంతో మంది వస్తారు, స్వామి లీలలను తెలుసుకుని భక్తితో రెండు చేతులు జోడించి ఆయన కృపకు పాత్రులు అవుతారు. స్వామి వారి ఆలయ చరిత్ర కానీ ఆయన ఆభరణాల విషయం కానీ హుండీ ఆదాయం కానీ స్వామి వారి ఆస్తులు కానీ అన్నీ కూడా ఎంతో ఆసక్తిని గొలిపే విశేషాలుగానే ఉంటాయి.

అత్యంత సంపన్న దేవాలయంగా :

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. తిరుమలకు ప్రతీ రోజూ దాదాపుగా డెబ్బై వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తూంటారు. ప్రతీ నెల మూడు నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం భక్తులు వేసే హుండీ కానుకల ద్వారా విరాళాల రూపంలో వస్తుంది.

దేశాల బడ్జెట్ కంటే :

ఇక స్వామి వారి ఆస్తుల విలువ చూస్తే ఏకంగా అయిదు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతారు. ఇది ప్రపంచంలోని ఎన్నో దేశాల బడ్జెట్ కంటే కూడా అధికం అని బహుశా చాలా మందికి తెలియదు. ఇక స్వామి వారి ఆలయంలో పదకొండు టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి. ఇందులో వేయి కిలోల బంగారు కిరీటం, రెండున్నర టన్నుల బంగారు కవచం, వేల సంఖ్యలోనే బంగారు ఆభరణాలు ఉన్నాయి.

ఎంతో సంపద ఉన్నా :

ఇక స్వామి వారి విషయం తీసుకుంటే ఆయనకు ఎంతో సంపద ఉంది. అయినా ఆయన అప్పులను తీర్చే స్వామిగా చెబుతారు కుబేరుడి వద్ద తన పెళ్ళి కోసం చేసిన అప్పుని ఈ రోజుకీ తీరుస్తునే ఉంటారని కూడా చెబుతారు. ఇది పురాణ ప్రసిద్ధమైన గాధగా కూడా ఉంది. అయితే ఇది కేవలం కధ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక రహస్యం అని చెబుతారు. స్వామికి అప్పులు ఏమిటి అని ఎంతో ఆలోచించినా అంతు చిక్కని విధంగా జవాబు అయితే దొరకదు.

సైన్స్ కి సైతం అందకుండా :

స్వామి వారి ఆలయంలో జరిగే ఎన్నో విషయాలు సైన్స్ కూడా అందనివి అంతు చిక్కనివి అంటే అతిశయోక్తి ఏ మాత్రం కాదు. మానవ మేధస్సుకు సైతం అది అందుకోలేని విషయంగా ఉంటుంది. ఇక్కడ స్వామి విగ్రహం మనిషి చెక్కినది కాదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అది నిజం. స్వయంభువుగా చెబుతారు. దాని అర్థం స్వామి వారు విగ్రహ రూపంలో తానుగా వెలిసారు అన్నది ఒక నమ్మకం. ఇక స్వామి వారి గర్భగుడిలో ఎపుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఎపుడూ 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతుంది. అయినా సరే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే స్వామి వారి విగ్రహానికి చమటలు పడుతూండడం. పూజార్లు ఆ చమటలను ఎప్పటికపుడు పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉంటారు. స్వామి వారికి గంధంపు లేపనం రాసినపుడు ఆయన హృదయంపైన అమ్మవారు లక్ష్మీదేవి ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది.

విగ్రహం వెనక ఏముంది :

స్వామి వారి విగ్రహం వెనక భాగం చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు, ఇంతకీ అక్కడ ఏముంది అంటే కొన్ని సొరంగాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న విషయం. 1937 ప్రాంతంలో ఒక పూజారి స్వామి వారి విగ్రహం వెనక్కి వెళ్ళారని అక్కడ ఆయన చూసిన దృశ్యం అయితే షాక్ కి గురి చేసిందని చెబుతారు. మరి అక్కడ ఏముంది అన్నది ఈ రోజుకీ అంతు చిక్కని విషయంగానే ఉంది.

తిరుపతి లడ్డూ గురించి :

స్వామి వారి మరో రూపమే లడ్డూగా చెబుతారు. భక్తులు దానిని ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తారు. లడ్డూకి ఉన్న పవిత్రత ప్రాశస్థ్యం అలాంటిది మరి. స్వామి వారి ఆలయంలో ప్రతీ రోజూ దాదాపుగా అయిదు లక్షల దాకా లడ్డూలు తయారు అవుతాయి. తమాషా ఏంటి అంటే అన్ని లడ్డూల రుచి బరువు విషయంలో ఏ మాత్రం తేడా లేకపోవడం. అన్నీ ఒకేలా సమానంగా ఉంటాయి. లడ్డూకి తయారు చేసే ప్రతీ వస్తువూ ఆలయానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి వస్తుంది. అక్కడ వెళ్ళేందుకు ఎవరికీ అనుమతి లేదు. అంతే కాదు ఈ రోజుకీ ఆ గ్రామంలోకి ఎవరూ వెళ్ళలేకపోయారు అని అంటారు.

అఖండ దీప కాంతులు :

స్వామి వారి ముందు వెలిగే దీపం అయితే అఖండ జ్యోతిగా చెబుతారు. వేల ఏళ్ళుగా అది అలా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటోంది అని కూడ అంటారు. చిత్రమేంటి అంటే ఆ దీపం ఒత్తి కానీ నూనె కానీ లేకుండానే వెలుగుతూ ఉండడం. మరి ఎలా వెలుగుతోంది అంటే. అదే మహిమ అని అంటారు.

విగ్రహానికి జుత్తు :

స్వామి వారి విగ్రహానికి జుత్తు ఉంటుందని చాలా మందికి తెలియదు. అది వేల ఏళ్ళ నాటిది అని చెబుతారు. ఈ రోజుకీ చిక్కు పడకుండా రాలకుండా అలాగే ఉంటోంది అంటే అది కూడా స్వామి వారి మహిమే అని అంటారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే జవాబు అయితే ఎవరూ చెప్పలేరు. అదే స్వామి లీల అని అంటారు.

ఆలయం ఎపుడు కట్టారు :

తిరుమల ఆలయం ఎవరు ఎపుడు కట్టించారు అంటే చారిత్రక ఆధారాలు అయితే లేవు. ఆలయ వయసు ఎంత అన్నది 1987లో ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా కార్బన్ రేటింగ్ ద్వారా ఆలయ వయసుని కనుగొనే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఉన్నట్టుండి వారి పరికరాలు పనిచేయకుండా పోయాయని చెబుతారు. అంటే ఆలయ రహస్యాలు బయటకు తెలియకుండా ఆ స్వామి అలా చేశారని చెబుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రహస్యాలు ఎన్నో తెలియని విషయాలు తిరుమల దేవుడు చుట్టూ ఉన్నాయి.

Tags:    

Similar News