'ధురంధర్' పాటకు దుమ్ము లేపిన రష్యన్ స్కేటర్.. వీడియో వైరల్!

ఈ వీడియోలో గుబనోవా ఎరుపు, గోల్డ్ కలర్ దుస్తులు ధరించి.. నుదుటున ఎరుపు బొట్టుతో కనిపించడం గమనార్హం.;

Update: 2026-02-10 16:55 GMT

బాలీవుడ్ లేటెస్ట్ సంచలనం "ధురంధర్" బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి ప్రకంపనలు సృష్టించిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రభావంతో కశ్మీర్ లోయలోని సింగిల్ స్కీన్ థియేటర్లు హౌస్ ఫుల్ గా రన్ అయ్యాయి. ఇదే క్రమంలో దేశం అవతలా ఈ సినిమా హల్ చల్ చేసింది.. సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సినిమాలో పాట వింటర్ ఒలింపిక్స్ లో వినిపించడం.. దానికి రష్యన్ స్కేటర్ ఫుల్ ప్రిపరేషన్ తో స్టేప్పులు వేయడం గమనార్హం.

అవును... ‘ధురంధర్’ సినిమా ఎఫెక్ట్ ఇంటలీలో జరుగుతున్న వింటర్ ఒలిపిక్స్ - 2026లోనూ కనిపించింది. ఇందులో భాగంగా... ఈ ఒలింపిక్స్ లో రష్యాలో జన్మించిన స్కేటర్ అనస్తాసియా గుబనోవా చేసిన ప్రత్యేకమైన స్కేటింగ్ ప్రదర్శన నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఇతర బాలీవుడ్ సంగీతంతో పాటు దురంధర్ సినిమాలోని టైటిల్ ట్రాక్ కు డ్యాన్స్ స్టెప్పులతో మిళితం చేస్తూ స్కేటింగ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వింటర్ ఒలింపిక్స్ లోని తన ప్రదర్శన సమయంలో... షారుఖ్ ఖాన్ - కరీనా కపూర్ నటించిన ‘అశోకా’ సినిమాలోని సాన్ సనానా పాటతో ప్రారంభమైన ఆమె ప్రదర్శన అనంతరం తాజా బాలీవుడ్ సంచలనం ధురంధర్ లోని మాస్ టైటిల్ సాంగ్ బీట్ వరకూ వెళ్లింది. ఈ ప్రదర్శన అనంతరం ఆమె సంగీత అభిమానుల నుంచి గణనీయమైన ప్రశంసలను పొందింది. ఈ వీడియోలో గుబనోవా ఎరుపు, గోల్డ్ కలర్ దుస్తులు ధరించి.. నుదుటున ఎరుపు బొట్టుతో కనిపించడం గమనార్హం.

కాగా... 23 ఏళ్ల గుబనోవా రష్యన్-జార్జియన్ ఫిగర్ స్కేటర్. రష్యాలో జన్మించిన ఆమె అంతర్జాతీయ పోటీల్లో జార్జియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె 2023 యూరోపియన్ ఛాంపియన్, రెండుసార్లు యురోపియన్ రజత పతకం సాధించారు.. ఇదే సమయంలో ఐ.ఎస్.యూ. ఛాలెంజర్ సిరీస్, గ్రాండ్ ప్రిక్స్ సర్క్యూట్లలోనూ అనేక పతకాలను గెలుచుకున్నారు. ఈ క్రమంలో వింటర్ ఒలింపిక్స్ లో ఆమె తాజా పెర్ఫార్మెన్స్ వైరల్ గా మారింది.

ఇక... 2024లో అశోక సినిమాలోని సాన్ సనానా సాంగ్ అంతర్జాతీయంగా వైరల్ అవ్వడం, ఆ తర్వాత ఇంటర్నెట్ లోనూ తుఫాను సృష్టించగా... తాజా బాలీవుడ్ సంచలనం ధురంధర్.. నెట్ ఫ్లిక్స్ టాప్ 10 నాన్-ఇంగ్లిష్ సినిమాల జాబితాలో 7.6 మిలియన్స్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది!


Tags:    

Similar News