టీడీపీ ఎంఎల్సీపై ప్రత్యేక కోర్టు విచారణ

Update: 2021-08-12 08:32 GMT
తెలుగుదేశం పార్టీ ఎంఎల్సీ దీపక్ రెడ్డి పై ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ మొదలవుతోంది. ఇప్పటివరకు ఈయన మీద ఉన్న అనేక కేసులు నాంపల్లి కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణకు ప్రతి రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణా కోర్టు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది.

దీపక్ రెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత. జేసీ బ్రదర్స్ కు దగ్గర బంధువు. ఈ కారణంతోనే జిల్లాలో చెలాయించుకుని వస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ లోని భోజగుట్ట ప్రాంతంలో బలహీనవర్గాలకు కేటాయించిన 13 ఎకరాల భూమిని పోర్జరీ సంతకాలతో సొంతం చేసేసుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సొంత దారులు క్రైం పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఇదే కాకుండా అనేక మార్గాల్లో ప్రభుత్వ భూములను కూడా కబ్జాచేయటం, సొంతం పేరుతో పత్రాలు తయారు చేసుకోవటమే వృత్తిగా పెట్టుకున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ఇదుకోసం దీపక్ ఓ గ్యాంగునే మైయిటైన్ చేస్తున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిజాం కాలంనాటి స్టాంపులు, దస్తావేజుల్లాంటివి తయారు చేసుకున్నారు. నిజాం కాలంలో రాసిచ్చేసినట్లుగా దస్తావేజులను సృష్టించి వాటిపై స్టాంపులు వేయటమే ఈ గ్యాంగ్ పనిగా పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ చుట్టుపక్కల వివాదాల్లో ఉన్న భూములను గుర్తించటం, నకిలీ పత్రాలను తయారు చేయటం, మళ్ళీ తమ పత్రాలు పోయినట్లు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటం, కోర్టులో కేసు వేసి తమ భూములను ఎవరు అమ్మకూడదని, కొనకూడదని స్టే తెచ్చుకోవటమే ఈ గ్యాంగ్ పనిగా పోలీసులు తమ విచారణలో నిర్ధారించుకున్నారు. ఇలాంటి ఆరోపణలపై పోలీసులు దీపక్+గ్యాంగును 2017లో అరెస్టు చేసి రిమాండ్ కు కూడా పంపారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు.

ఇలాంటి వ్యక్తికి టీడీపీ ఎంఎల్సీ అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఈయన ఆధ్వర్యంలో రు. 400 కోట్లకు పైగా విలువచేసే భూములున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈయనపై ఉన్న కబ్జా కేసులన్నింటినీ క్రైం పోలీసులు నాంపల్లి కోర్టునుండి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీచేశారు. తొందరలోనే దీపక్ రెడ్డిపై ఉన్న కేసులను ప్రత్యేక కోర్టు విచారణ మొదలుపెట్టబోతున్నట్లు క్రైం పోలీసులు చెప్పారు.


Tags:    

Similar News