‘సారీ’ మాత్రం చెబితే సరిపోదు జగన్... అర్ణబ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం జాతీయ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.;
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం జాతీయ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ విషయంపై ఏపీలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికీ మధ్య మాటల యుద్ధాలు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి స్పందిస్తూ... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ‘క్షమాపణ’ డిమాండ్ చేశారు!
అవును... ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై అర్ణబ్ గోస్వామి స్పందిస్తూ... జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా... నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వాదించడంలో అర్థమేంటి జగన్? మీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి పంపిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందన్నది వాస్తవం కాదా? మీ మతవిశ్వాసాలతో ఎవరైనా ఆడుకుంటే ఊరుకుంటరా? హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేందుకు ఎలా అనుమతించారు?
అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అర్ణబ్ గోస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదం పొందడాన్ని గొప్ప ఆశీర్వచనంగా హిందువులంతా పరిగణిస్తారు.. అలాంటి స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే లడ్డూను రసాయనాలతో కూడిన సింథటిక్ నెయ్యితో చేశారు.. ఇది దేశంలో 100 కోట్లకు పైగా ఉన్న హిందువుల మనోభావాలను నేరుగా దెబ్బతీసినట్టే. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు కాబట్టి ఇది పెద్ద విషయం కాదు అనడం సెంటిమెంట్స్ తో ఆడుకోవడమే అని అర్ణబ్ పేర్కొన్నారు.
ఇదే క్రమంలో... సీబీఐ దర్యాప్తులో కల్తీ నెయ్యి వాడినట్లు రుజువైందని.. హిందువుల విశ్వాసాల్ని దెబ్బతీయడానికి ఇంత భారీ కుట్రకు ఎందుకు పాల్పడ్డారు.. 300 ఏళ్లుగా శుద్ధమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాలు చేసే పవిత్ర సంప్రదాయాన్ని ఐదేళ్లలో నాశనం చేశారు.. సిట్ నివేదిక మీకు క్లీన్ చీట్ ఇవ్వలేదు.. ఈ ఘోరతప్పిదానికి 'సారీ' అని మాత్రం చెబితే సరిపోదు.. దేశ ప్రజల ముందు చేతులు జోడించి క్షమించాలని వేడుకోండి.. మరో మార్గం లేదు జగన్ అని అర్ణబ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి!