• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముందు ఎవరిని బతికించాలో...

ముందు ఎవరిని బతికించాలో మీరే చెప్పండి ..డాక్టర్లు

By - Tupaki Desk
Update: 2020-03-28 03:30 GMT
కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా కరోనా వైరస్ తో భాదపడుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన చైనా కంటే , అమెరికా , ఇటలీ , స్పెయిన్ లోనే కరోనా భాదితులు ఎక్కువగా ఉన్నారు. స్పెయిన్ లో 64,059 మంది కరోనా భాదితులు ఉన్నారు. అలాగే కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 4,858 మంది మృత్యువాత పడ్డారు. స్పెయిన్ లో కరోనా భీభత్సం సృష్టిస్తుంది.

అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ..కొంతమంది కరోనా పేషెంట్లు వెయిటింగ్ రూంలలో ఎదురుచూస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని చోట్ల అంత్యక్రియలు పూర్తి చేసేందుకు కూడా చోటు దొరకడం లేదు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కొత్త రూల్స్ తో హ్యాంగ్ అయిపోతున్నాయి. పాత పేషెంట్లను చికిత్స చేయకముందే కొత్త వాళ్లు వచ్చిపడుతున్నారు. మాడ్రిడ్ లోని ఎమర్జెన్సీ రూంలో ఒక కరోనా పేషెంట్ కు డెత్ సర్టిఫికేట్ ఇస్తూనే మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లాడు డేనియల్ బెర్నబ్యూ.
'ఆ తాత ఏ పరిస్థితుల్లో అయినా, బతికే అవకాశం కనిపించడం లేదు. చాలా మంది చావుతో పోరాడుతున్న వారిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే ముందెవరికి చికిత్స కావాలో వారే తేల్చుకోవాలి' అని ఆ డాక్టర్ అంటున్నాడు.

స్పెయిన్ కబలిస్తున్నకరోనా యూరప్ మొత్తానికి షాకింగ్ గా మారింది. 47మిలియన్ మంది జనాభా ఉన్న దేశమైనప్పటికీ చైనా కంటే వేగంగా కరోనా ప్రభావానికి గురవుతోంది. ఇటలీ కంటే వేగంగా పాకడంతో స్పెయిన్ కరోనా నుండి కోలుకోలేకుండా పోతుంది. . ప్రధాని పెడ్రో శాంచెజ్ మూడు వారాల ముందే వైరస్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంలో చాలా మంది ఇటువంటి పరిస్థితులను ఇప్పటివరకూ ఫేస్ చేయలేదు. సివిల్ వార్ గురించి తెలిసిన వాళ్లు మాత్రమే అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి కంటే గడ్డు పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్లోనూ వ్యాధి లక్షణాలున్న వాళ్లు కనిపించడం తో అంతా లాక్ డౌన్ ప్రకటించేశారు. ఎమర్జెన్సీ అయినప్పటికీ కూడా ..పూర్తి స్థాయి సేఫ్టీతోనే బయటకి రావాలని ప్రధాని తెలిపారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • international news 
  • spain 
  • doctors 
  • patients 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS