సోము వీర్రాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2022-01-20 10:40 GMT
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. ప్రబుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల హెచ్.ఆర్ ను ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వంగా మారిందన్నారు. గతంలో ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. ఆత్మకూరు ఘటనలో ప్రబుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని సోము వీర్రాజు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో ఒక్కొక్కరిపై ఒక్కో రకంగా కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

ముస్లింలకు స్టేషన్ బెయిల్ ఇస్తే హిందువు అయిన బీజేపీ కార్యకర్తను మాత్రం రిమాండ్ కు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని చెప్పొచ్చని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. హిందూ వ్యతిరేక విధానాలతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శలు చేశారు.

ఆత్మకూరు ఘటనలో బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. ెస్డీపీఐ నేత అతావుల్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

విజయనగరం, రామతీర్థం ఘటనల్లో ఇంతవరకూ నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం చేస్తే వెంటనే అరెస్ట్ చేశారని.. రాముడి విగ్రహం ద్వంసం చేస్తే నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముస్లింల చేత వందేమాతరం పాడించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
Tags:    

Similar News