జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన‌లో ఇన్ని మెలిక‌లున్నాయా?

Update: 2022-07-12 23:30 GMT
అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన‌పై నిపుణులు, విద్యావేత్త‌లు పెద‌వి విరుస్తున్నారు. ఈ ప‌థ‌కంలో ప్ర‌భుత్వం ఎన్నో మెలిక‌లు పెట్ట‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అంటున్నారు. వాస్త‌వానికి విదేశాల్లో ఏ యూనివ‌ర్సిటీలో చ‌దువుకున్నా ప్ర‌భుత్వం విదేశీ విద్యా దీవెన కింద సాయం చేయాలి. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఇలా విదేశాల‌కు వెళ్లి ఎవ‌రు చ‌దువుకున్నా ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేశార‌ని అంటున్నారు.

అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం విదేశాలకు వెళ్లి చ‌ద‌వాల‌నుకునేవారికి నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. కేవ‌లం ప్ర‌పంచంలో టాప్ 200 యూనివ‌ర్సిటీల్లో సీట్లు సాధించేవారికి మాత్ర‌మే ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అని మెలిక‌పెట్టింద‌ని చెబుతున్నారు. ఈ టాప్ 200 యూనివ‌ర్సిటీల్లో సీట్లు సాధించేవారి సంఖ్య చాలా చాలా త‌క్కువ ఉంటుంద‌ని అంటున్నారు. ఈ టాప్ 200 యూనివ‌ర్సిటీల్లో స‌గానికిపైగా ఒక్క అమెరికాలోనే ఉంటాయ‌ని, మిగిలిన‌వి యూకే, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ త‌దిత‌ర దేశాల్లో ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ఈ టాప్ 200 యూనివ‌ర్సిటీల్లో చ‌ద‌వ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 200 దేశాల విద్యార్థులు పోటీ ప‌డుతుంటార‌ని పేర్కొంటున్నారు. టాప్ 200 యూనివ‌ర్సిటీలు కావ‌డంతో వీటిలో ఎంపిక ప్ర‌క్రియ కూడా చాలా క్లిష్టంగా ఉంటుంద‌ని అంటున్నారు. కేవ‌లం అక‌డ‌మిక్ ప్ర‌తిభ మాత్ర‌మే కాకుండా జీఆర్ఈ, టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీమ్యాట్, శాట్ త‌దిత‌ర ప‌రీక్ష‌ల్లో చాలా బెస్ట్ స్కోర్ సాధించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇవి మాత్ర‌మే కాకుండా విద్యార్థుల్లో నాయ‌క‌త్వ సామ‌ర్థ్యాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో ప్ర‌తిభ త‌దిత‌రాల‌ను కూడా చూసి ఎంపిక చేస్తార‌ని గుర్తు చేస్తున్నారు.

అంతేకాకుండా టాప్ 200 యూనివ‌ర్సిటీల్లో విదేశీ విద్యార్థుల‌కు కూడా సీట్లు త‌క్కువ ఉంటాయ‌ని అంటున్నారు. ఇన్ని నిబంధ‌న‌ల మ‌ధ్య ఈ టాప్ యూనివ‌ర్సిటీల్లో సీట్లు సాధించ‌డం అంతా ఆషామాషీ కాద‌ని చెబుతున్నారు. అందులోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌పంచంలో టాప్ 100 యూనివ‌ర్సిటీల్లో సీట్లు వ‌స్తేనే పూర్తి ఫీజురీయింబ‌ర్స్మెంట్ అని పేర్కొంద‌ని గుర్తు చేస్తున్నారు. 100 పై నుంచి 200లోపు ఉన్న యూనివ‌ర్సిటీల్లో సీట్లు సాధిస్తే 50 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే చెల్లిస్తామ‌ని నిబంధ‌న పెట్టింద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు ప్ర‌భుత్వం పెట్టిన నిబంధ‌న‌లు కూడా విద్యార్థుల విదేశీ విద్య‌కు ఆటంకాలుగా నిలుస్తాయని అంటున్నారు. అభ్య‌ర్థుల‌కు 8 ల‌క్ష‌ల రూపాయ‌ల వార్షికాదాయం, 35 ఏళ్ల‌లోపు వ‌య‌సు మాత్ర‌మే ఉండాల‌నే నిబంధ‌న‌లు కూడా ఇబ్బందేన‌ని చెబుతున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన నిబంధ‌న‌లు అడ్డంకిగా ఉంటాయ‌ని అంటున్నారు. టాప్ 100 లేదా 200 యూనివ‌ర్సిటీల్లో సీట్లు సాధించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చెబుతున్నారు.  

కేవలం ప్రభుత్వం ప్రచారం కోసమే తప్ప.. ఈ పథకం పేద వర్గాలకు ప్రయోజనం కల్పించేందుకు కాదనే విమర్శలు వస్తున్నాయి. కాగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు స్కాలర్షిప్పులు ఇచ్చేందుకు 500 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ వర్సిటీలను అర్హతగా నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ వర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకే అంటూ మెలిక పెట్టింద‌ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ప్రభుత్వం అందించే సాయం బడుగులకు అందదని చెబుతున్నారు. ఆ స్థాయి వర్సిటీల్లో సీట్లు పొందే విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారు.

గ్రామాల్లో చదువుకునే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం వర్తించే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. 200 క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ వర్సిటీల్లో సీట్లు సంపాదించుకునే విద్యార్థులకు ప్రభుత్వం స్కాల‌ర్షిప్పులు ఇవ్వాల్సిన‌ అవసరం లేదని, పలు కార్పొరేట్‌ సంస్థలు, యూనివర్సిటీలే స్కాల‌ర్షిషిప్పులు అందిస్తాయని అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News