భయంకరమైన నిజం.. చావుతో బయటపడింది!
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ పట్టణంలో ఇటీవల భార్యభర్తలు మరణించారు. వారి చావుతో ఓ భయంకరమైన నిజం బయటకొచ్చింది. అసలు వాళ్లు భార్యభర్తలే కారట. ఇద్దరూ స్వలింగసంపర్కులట. ఈ విషయం తెలిసి బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఇవే.. సెహోర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి 2012 లో ఓ వ్యక్తిని యువతిగా నమ్మించి కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. సెహోర్ పట్టణంలోనే వాళ్లు కాపురం పెట్టారు. పెళ్లైన రెండేళ్లకు ఓ బాలుడిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. ఎనిమిదేళ్లపాటు ఇద్దరూ కలిసే జీవించారు. చుట్టుపక్కల వాళ్లు, తల్లిదండ్రులు కూడా వాళ్లను భార్య,భర్తలుగానే నమ్మేవారు. కాగా గత ఆగస్టు 11న భార్య, భర్తలుగా చెప్పకుంటున్న వీళ్లమధ్య గొడవ చెలరేగింది. దీంతో భార్య శరీరానికి నిప్పుపెట్టుకున్నది. భార్యను కాపాడే యత్నంలో అతడికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి భోపాల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య ఆగస్టు 12న చనిపోగా.. సదరు వ్యక్తి పరిస్థితి విషమించి ఆగస్టు 16న కన్నుమూశాడు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. చనిపోయిన ఇద్దరు మగవారేనంటూ డాక్టర్లు నివేదిక ఇచ్చారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.
చనిపోయిన ఇద్దరు మగవారేనన్న విషయం పోలీసులు కుటుంబసభ్యుల వద్ద ప్రస్తావించగా మాకు తెలియదని సమాధానమిచ్చారు. దీంతో పూర్తి అటాప్సీ వివరాలు వస్తేనే అసలు విషయం బయటపడుతుందని పోలీసులు భావించారు. చనిపోయిన భార్య అటాప్సీ పూర్తి రిపోర్ట్‌ను పరిశీలించగా.. చనిపోయింది అమ్మాయి కాదని.. అబ్బాయేనని డాక్టర్లు నిర్థారించారు. ఇదే విషయమై పోలీసులు మరోసారి కుటుంబసభ్యులను ఆరా తీశారు. చనిపోయిన భర్త తరపు సొంత అన్నయ్య స్పందించాడు. 'నా తమ్ముడు ఎల్జబీటీ ఉద్యమానికి మద్దతుగా పోరాటం చేసేవాడు. అక్కడే అతనికి ఒక గే పరిచయం అయ్యాడని.. మేమిద్దరం కలిసి బతకాలని నిర్ణయించుకున్నట్లు మాతో తెలిపాడు. కానీ మా కుటుంబానికి అది ఇష్టం లేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తర్వాత మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని దూరంగా ఉంటున్నట్లు' తెలిపాడు. 8 ఏళ్లుగా సెహూర్ లో నివసిస్తున్న వారిద్దరూ నిజమైన భార్య భర్తల్లాగా ఉండేవారని.. చనిపోయేంతవరకు కూడా స్వలింగ సంపర్కులు అన్న అనుమానం కూడా కలగలేదని అక్కడి స్థానికులు పేర్కొన్నారు. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 సెప్టెంబర్ 6న భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కింద గే సెక్స్‌లో పాల్గొనే వారికి శిక్ష విధించడం సరికాదని తేల్చి చెప్పింది.