కూతురిపై కన్నేసిన పెదనాన్న..కాకినాడలో దారుణం

Update: 2020-10-08 12:40 GMT
వావీవరసలు మరచిపోయి రెచ్చిపోతున్నారు కామాంధులు. అయినవాళ్లే ఆడవాళ్లపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు దిగుతున్నారు. అసభ్యంగా తాకుతూ , అత్యాచారానికి పాల్పడుతూ చెలరేగుతున్నారు. కూతురు వరసయ్యే పెళ్ళైన యువతీ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రబుద్ధుడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురు వరసయ్యే మహిళపై కన్నేశి, ఆమెను అమానుషంగా అత్యాచారం చేశాడు. అంతటితో ఆగని దుర్మార్గుడు మరోమారు ఇంటికి వెళ్లి రేప్ చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.  దీనితో అసలు వ్యవహారం కొంచెం ఆలస్యంగా వెలుగులో వచ్చింది.

 కాకినాడ సర్పవరం జంక్షన్ పరిధిలో జరిగింది. నగరంలోని బుడంపేటకు చెందిన వివాహిత పై ఆమెకు పెదనాన్న వరసయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండేళ్ల కిందట తనపై అత్యాచారం చేశాడని.. గత సెప్టెంబర్‌లో మరోమారు తన ఇంటికి వచ్చిన కీచకుడు రేప్ చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివాహిత అభియోగాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News