రెండేళ్ల పెంపు.. జ‌గ‌న్‌కు, ఉద్యోగుల‌కు హ్యాపీ.. రాబోయే స‌ర్కారుకు షాక్

Update: 2022-01-09 00:30 GMT
రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తూ.. వ‌చ్చిన స‌మ‌స్య‌లను సంపూర్ణంగా తీర్చ‌లేక పో యిన ఏపీ ప్ర‌భుత్వం.. వారు అడ‌గ‌ని, అస‌లు ఊహించిన వాటిని తెర‌మీదికి తెచ్చి.. నేను పూర్తిగా మీవెంటే అని చెప్ప‌డం వెనుక సీఎం జ‌గ‌న్ వ్యూహం ఏమైనా ఉందా?  తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఉద్యోగుల‌ను మ‌చ్చిక చేసుకునే మంత్రం వేశారా? అనే సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఇబ్బం దిగానే ఉంది. అప్పు చేస్తే త‌ప్ప‌.. గ‌డ‌వ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది.

ఈ స‌మ‌యంలో పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ను 45 శాతం పెంచే ప‌రిస్థితి లేదు. కానీ, ఎన్నిక‌ల‌కు ముందు మా త్రం చంద్ర‌బాబు ఇచ్చిన దానిక‌న్నా కూడా మెరుగైన ఫిట్‌మెంట్ ఇస్తామంటూ.. జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యం లో ఇప్పుడు ఇవ్వ‌లేక పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. దీనికితోడు కంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేయ‌డం కూడా పెద్ద స‌వాలుతో కూడుకున్న ప‌నే. అదేస‌మ‌యంలో సీపీఎస్(కంట్రి బ్యూట‌రీ పింఛ‌న్ స్కీం)ను ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్‌పై ఎన్నిక‌ల‌కు ముందు చేసిన వాగ్దానాన్ని కూడా జ‌గ‌న్ నిలబెట్టుకునే ప‌రిస్థితి లేదు.

ఈ నేప‌థ్యం లోనే ఉద్యోగుల‌కు అన్ని విధాలా నిరాశ‌ప‌రిచిన‌ట్టు అవుతుంది. ఇది.. తీవ్ర వ్య‌తిరేక‌త‌ ను పెం చే అవకాశం ఉంటుంది. అందుకే వ్యూహాత్మ‌కంగా వారి ప‌ద‌వి వివ‌ర‌ణ వ‌య‌సును ఏకంగా 2 సంవత్స‌రా లు పెంచారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. జ‌గ‌న్ త‌మ‌కు `భారీ` మేలు చేశార‌న్న భావ‌న‌లో ఉద్యోగులు ఉంటారు. ఫ‌లితంగా ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త త‌గ్గుతుంది. వ్య‌క్తిగ‌తంగా.. రాజ‌కీయంగా జ‌గ‌న్‌కు మేలు చేసే వ్య‌వ‌హారం అయితే అయివుంటుంది.

మ‌రోవైపు.. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును  రెండేళ్లు పెంచ‌డం వ‌ల్ల‌ ఉద్యోగుల‌కు మేలే. భారీ ఎత్తున వేత‌నాలు పెరుగుతాయి. బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. కానీ, ఎటొచ్చీ ప్ర‌భుత్వానికి మాత్రం భారీ స్థాయిలో ఆర్థిక భారం పెరిగిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఎలా అంటే.. చివ‌రి రెండు సంవ‌త్స‌రాలు.. ఉద్యోగుల‌కు ఉన్న వేత‌నాల ఆధారంగా రేపు పింఛ‌న్‌ ను నిర్ణ‌యించాలి. అదే విధంగా గ్రాట్యుటీ పెరుగుతుంది. ఫ‌లితంగా ప్ర‌భుత్వం పై ఆర్థికంగా భారం పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు.

ఇక‌, ఆ రెండు సంవ‌త్స‌రాలు కూడా ఉద్యోగుల నుంచి పెద్ద‌గా ఆశించేది ఏమీ ఉండ‌దు. అంతేకాదు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెరిగి.. స‌ర్కారు పై ఆర్థిక భారం మ‌రింత పెరుగుతుంది. ఎలా చూసుకున్నా.. రెండు సంవ‌త్స‌రాలు పెంచ‌డం పై ఉద్యోగుల‌కు ఆనంద‌మే అయినా.. ప్ర‌భుత్వానికి మాత్రం దీర్ఘ‌కాలంలో చేతి చ‌మురు మ‌రింత వ‌దులుతుంద‌ని అంటున్నారు. ఇదిలావుంటే. అస‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా. జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన రిటైర్మెంట్ వ‌య‌సును పెంచ‌డం వ‌ల్ల కేవ‌లం వారిలో ఆగ్ర‌హం తక్కించ‌డం కోస‌మే వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు.
Tags:    

Similar News