మోడీకి షాక్: వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లు వీరే
ప్రధాని నరేంద్రమోడీ మాటను అదే బీజేపీ ఎంపీ బుట్టదాఖలు చేశాడు. దేశంలో మొదటి కరోనా వ్యాక్సిన్ వైద్యులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్మికులకే అని మోడీ బల్లగుద్ది మరీ చెప్పేశాడు. ప్రజాప్రతినిధులకు తొలి విడత లేదని స్పష్టం చేశాడు. దీంతో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా వెనక్కితగ్గాడు. అయితే స్వయంగా బీజేపీ ఎంపీ మోడీ నిబంధనలు బుట్టదాఖలు చేశాడు.
ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ మహేష్ శర్మ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రవీంద్రనాథ్ చటర్జీ దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి పొలిటీషియన్లుగా నిలిచారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.
యూపీలోని గౌతమ బుద్దనగర్ కు చెందిన ఎంపీ మహేష్ శర్మ (61) వృత్తిరీత్యా వైద్యుడు కావడం విశేషం. తొలి దశలో హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వడంతో మహేష్ శర్మ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. పేషెంట్స్ వెల్ ఫేర్ కమిటీలో రవీంధ్రనాథ్ కూడా సభ్యుడిగా ఉండడంతో టీఎంసీ ఎమ్మెల్యేకు కూడా అధికారులు వ్యాక్సిన్ ఇచ్చారు.
ఇలా దేశంలో కరోనా టీకా తీసుకున్న తొలి ఎంపీ, ఎమ్మెల్యేగా వీరిద్దరూ ఖ్యాతి గడించారు. ఇక రెండోవిడతలో ఎవరికి ప్రాధాన్యతనిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వ్యాక్సిన్ కు డిమాండ్ ఉండడంతో ప్రాధాన్యత క్రమంలో తదుపరి ఎవరికి చేరుస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే రెండో దశలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్టు మోడీ తెలిపారు. అయితే అది ఎవరికి అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.