విశాఖకు షిఫ్టింగ్ ఖాయం... ?

Update: 2021-08-13 05:30 GMT
వైసీపీకి విశాఖ కావాలి. పాలనా రాజధానిగా విశాఖను వైసీపీ ప్రకటించింది. దీని మీద చట్టం కూడా చేసింది. అయితే అది న్యాయ పరిశీలనలో ఉంది. దాంతో వైసీపీకి ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఇప్పటికే జనాలకు మాట ఇచ్చేశారు. మూడు రాజధానులు అంటూ వైసీపీ గొప్పగా చెప్పుకుంది. మరో వైపు చూస్తూండగానే సగం పదవీ కాలం పూర్తి అయింది. ఇప్పటి నుంచే సర్దుకోకపోతే వచ్చే ఎన్నికల వేళకు జనాలే ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా ఎవరికీ ఏమీ అసలు తెలియదు. దాంతో వైసీపీ కొత్త ప్లాన్ ఆలోచిస్తోంది. దాంతో విశాఖ వాసులకు నమ్మకం కలిగించడమే కాకుండా తాము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అందరికీ తెలియచేస్తోంది.

ఇక వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఉంది. జగన్ విలాసవంతమైన భవనాన్ని 2019 ఎన్నికల ముందు అక్కడ కట్టారు. ఆ భవనంలోనే ఆఫీస్ ఇప్పటిదాక రన్ అవుతోంది. ఇక జగన్ తాజాగా తీసుకున్న కీలకమైన నిర్ణయం ఏంటి అంటే ఆ భవనాన్ని విశాఖ తరలించాలని. అంటే వైసీపీకి ఆయువు పట్టు లాంటి ఆఫీస్ ని విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దాని కోసం విశాఖలో మంచి సెంటర్ లో భవనాన్ని కూడా చూస్తున్నారు. విశాఖలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం అంటే కచ్చితంగా తొందరలో వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రితో సహా విశాఖకు వస్తారని సంకేతాలు ఇవ్వడమే.

ఈ తరలింపు ఏర్పాట్లు ఇపుడు జోరందుకున్నాయి. పార్టీలో కేలకమైన నేతలే వీటి సంగతి చూస్తున్నారు. మరో వైపు జగన్ కూడా విశాఖకు షిఫ్ట్ అవుతారు అని కూడా అంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖకు తొందరలోనే వస్తుంది అని కూడా చెబుతున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా ఉండవచ్చు. దానికి ఏ రకమైన ఇబ్బందులు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి విశాఖ రాక అన్నది కూడా ఖాయమనే అంటున్నారు. మొత్తానికి మూడవ ఏడాదిలోకి ప్రవేశించిన జగన్ ఏలుబడిలో మూడు రాజధానుల విషయంలో ఒక కదలిక వస్తుందని అంటున్నారు.

అదే స‌మ‌యంలో ఎలాగైనా మ‌రో నాలుగైదు నెల‌ల‌కు అయినా విశాఖ‌కు రాజ‌ధాని వ‌స్తుంద‌న్న బ‌ల‌మైన అంచ‌నాల‌తో ఉన్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ స‌మీప ప్రాంతాల్లో రియ‌ల్ట‌ర్ల‌కు ఉప్పందించారు. దీంతో వీరంతా అక్క‌డ సీక్రెట్‌గా పెట్టుబ‌డులు కూడా పెడుతోన్న ప‌రిస్థితి ఉంద‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాలు చూస్తుంటే ఈ యేడాది చివ‌రకు అయినా విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌ల‌డం ఖాయ‌మే అంటున్నారు.


Tags:    

Similar News