పెంపుడు పిల్లితో ఆమె గర్భవతి.. కారణం తెలిస్తే అవాక్కే

Update: 2020-07-21 04:30 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా.. విషయం మొత్తం తెలిస్తే సరదాగా నవ్వుకోవటం ఖాయం. తాము పెంచుకునే పెంపుడు పిల్లి తన భార్య ప్రెగ్నెంట్ కావటానికి కారణమైందని వాపోతున్నాడో భర్త. సోషల్ మీడియాలో తన వేదనను పంచుకున్న ఆ భర్త పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే?

కరోనా నేపథ్యంలో రెండోసారి తన భార్య గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడా భర్త. ఇందులో భాగంగా సెక్సులో పాల్గొనే ప్రతిసారి తప్పనిసరిగా కండోమ్ వాడుతున్నాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా తాజాగా తన భార్య గర్భవతి కావటంతో విస్మయానికి గురయ్యాడు. అసలేం జరిగిందన్న విషయాన్ని ఒక్కొక్కటిగా క్రాస్ చెక్ చేసుకున్న అతగాడికి.. అసలు విషయం అర్థమైందని చెప్పుకున్నాడు.

తాము టామ్ అనే పిల్లిని ఇంటికి తెచ్చుకున్నామని.. అది మహా అల్లరిదని చెప్పాడు. ఇంట్లో అది తిన్నగా ఉండదని.. ఎప్పుడో ఏదో ఒక దాన్లోకి దూరి అల్లరి చేస్తుందని చెప్పాడు. అలా ఒకసారి సొరుగులోకి చేరి.. అందులోని వస్తువుల్ని కింది పారేసిందని.. అలా పారేసిన వాటిల్లో కండోమ్ లుకూడా ఉన్నాయట. కింద పడిన వాటిని మళ్లీ సొరుగులో వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న సదరు భర్త.. ఆ కండోమ్ ల్ని పరిశీలిస్తే.. తప్పు ఎక్కడ జరిగిందో అర్థమైపోయింది.

తమ పెంపుడు పిల్లి కండోమ్ ప్యాకెట్లను కొరికేయటం.. ఆ విషయాన్ని తాను గుర్తించకుండా వాడేయటం ద్వారా.. వీర్యం లీకై.. గర్భానికి కారణమైందన్న విషయాన్ని గుర్తించాడు. తన భార్య గర్భవతి అయ్యిందన్న బాధ తనకు లేదని.. కాకుంటే తాము చేసిన ప్లానింగ్ దెబ్బ తినటమే తనకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. మొత్తంగా పెంచుకున్న పిల్లి పుణ్యమా అని.. అతగాడి ప్లాన్ దెబ్బ తిన్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News