జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసులో సంచలన తీర్పు

Update: 2021-04-21 05:32 GMT
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య దేశమొత్తాన్ని ఉడికించింది. ప్రజలంతా ఈ దారుణంపై రోడ్డెక్కారు. నల్లజాతీయుడిని అకారణంగా చంపిన పోలీసులపై దాడులకు కూడా దిగారు. పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత అమెరికా వ్యాప్తంగా ఉద్యమం చెలరేగింది. బ్లాక్ లైవ్ మ్యాటర్ పేరుతో అమెరికా ప్రజలు ఉద్యమించారు.లాఠీచార్జీ కాల్పులు చేపట్టారు. ఈ ఘటనకు కారణమైన పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ ను విధుల నుంచి తొలగించడమే కాకుండా కేసు నమోదు చేసి విచారించారు.

తాజాగా ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ 10 గంటల పాటు సుధీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ విచారణ అనంతరం తీర్పు వెలువరించింది.

జార్జ్ ఫ్లాయిడ్ మృతికి మిన్నియా పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ కారణమని తీర్పు ఇచ్చింది. సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, నరమేధ హత్యగా దీన్ని కోర్టు పేర్కొంది.

కోర్టు హాల్ అంతా తీర్పు సమయంలో ప్రజలతో నిండిపోయింది. తీర్పు పాజిటివ్ గా రావడంతో ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు.
Tags:    

Similar News