మరే హాలీవుడ్ మూవీలో కూడా ఇలాంటి రియల్ సీన్ చూసి ఉండరు
భారీ భవనం. అది కూడా అలాంటి ఇలాంటిది కాదు. ఏకంగా 72 అంతస్తుల భవనం. 356 అడుగుల ఎత్తులో.. చైనాలోని అత్యంత ఎత్తైన భవనాల్లో 21వ ప్లేస్ లో ఉన్న ఈ భవనం చైనీయులకు సినిమా చూపించింది. సెగ్ ప్లాజాగా వ్యవహరించే ఈ భవనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
భారీ భవనాలు.. అందునా ఇంత పెద్ద భవనం అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నిర్మిస్తుంటారు.భారీ భూకంపం వచ్చినా ఏం కానట్లుగా ఇలాంటి ఆకాశ హర్మ్యాల్ని నిర్మిస్తారు. అలాంటిది ఎలాంటి భూకంపం లేకుండానే.. ఈ భారీ భవనం దానికదే ఊగిపోవటంతో అక్కడి వారు వణికిపోయారు. ఎందుకు ఊగుతుందో తెలీదు.. చుట్టుపక్కల పరిస్థితి అంతా బాగున్నా.. ఈ భారీ భవనం ఊగటం షురూ చేయటంతో అక్కడి అధికారులు.. ప్రజలు వణికిపోయారు.
వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ భవనాన్ని ఖాళీ చేయించారు. తొలుత ఈ భవనంలో ఉన్న వారంతా.. బిల్డింగ్ ఊగుతుంటే.. భారీ భూకంపం ఏమైనా వచ్చిందేమోనని భావించారు. కానీ.. పక్కనున్న భవనాలు నిక్షేపంగా ఉండగా.. తామున్న భవనం మాత్రం ఊగటంతో వారు షాక్ తిన్నారు. ఈ భారీ భవనంలోని పది అంతస్తుల్లో షెన్ జెన్ ఎలక్ట్ట్రానిక్స్ గ్రూపు ఆఫీసులు ఉన్నాయి. మిగిలిన అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. 21 ఏళ్ల క్రితం అంటే.. 2000లో ఈ భవన నిర్మాణాన్నిపూర్తి చేశారు.
మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట (స్థానిక కాలమానం ప్రకారం) ఒక్కసారిగా ఈ భారీ భవనం ఊగటం మొదలైంది. దేశంలో ఎక్కడా భూకంపం నమోదు కాలేదు. కానీ.. ఈ భవనం ఎందుకు ఊగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రంగంలోకి దిగిన అధికారులు ఈ భారీ భవనాన్ని రెండు గంటల వ్యవధిలో ఖాళీ చేయించారు. ఈ భవనం ఊగటాన్ని చూసిన అక్కడి వారంతా భయంతో పరుగులు తీశారు. ఏ మాత్రం తేడా వచ్చినా జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందని తెలుసు. అందుకే.. వారంతా వణికారు. అయితే.. భవనం ఊగటానికి కారణం ఏమిటన్నది ఇంకా తేల్లేదు. దీంతో.. చైనాలోని భారీ భవంతుల్లో ఉండే వారిప్పుడు అయోమయానికి గురవుతున్నారు. టెన్షన్ తో వణుకుతున్నారు. ఈ భవనం ఎందుకు ఊగిందన్న విషయాన్ని తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.