వైసీపీ మావిగాన్ : కమ్మ వర్సెస్ కాపు ఇష్యూ గానా ?

వైసీపీ అమరావతి రాజధాని విషయంలో తనదైన శైలిలోనే ముందుకు సాగుతోంది. మావిగాన్ అన్నది వైసీపీ యధాలాపంగా అన్నదా అంటే కాదు అని తెలుస్తోంది.;

Update: 2026-04-12 04:30 GMT

వైసీపీ అమరావతి రాజధాని విషయంలో తనదైన శైలిలోనే ముందుకు సాగుతోంది. మావిగాన్ అన్నది వైసీపీ యధాలాపంగా అన్నదా అంటే కాదు అని తెలుస్తోంది. తాము అనుకున్నట్లుగానే మావిగాన్ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. చిత్రమేంటి అంటే అమరావతి కంటే మావిగాన్ కి జనాల మద్దతు ఉందని వైసీపీ భ్రమించడం. నిజానికి ఇది అతి పెద్ద ట్రోల్ కంటెంట్ గా మారి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. దాని వల్ల పాజిటివిటీ కంటే నెగిటివిటి వ్యాప్తి చెందుతోంది. కానీ వైసీపీ మాత్రం మావిగాన్ అన్న దాని మీద జనాలు పెద్ద ఎత్తున ఆదరణ కనబరుస్తున్నారని అందుకే టీడీపీలో వణుకు పుడుతోంది అని అంటోంది.

సెల్ఫ్ గోల్ వేసుకుంటూనే :

అయితే మావిగాన్ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం తెలిసినా తెలియనట్లుగా అంతా బాగానే ఉంది తమ డిమాండ్ కి మద్దతు లభిస్తోందని చెప్పుకుని ఆత్మ సంతృప్తి చెందుతోందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ అయితే గత వారం పది రోజులుగా మావిగాన్ ని ఒక బలమైన స్లోగన్ గా తమకు దాని వల్ల వేయి రెట్లు రాజకీయ బలం వచ్చినట్లుగా చేసుకుంటున్న ప్రచారాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఇది రాజధాని ఎంపిక సమయం కాదని అంతా అంటున్న మాట. ఇక అమరావతికి రాజధాని చట్టబద్ధత వచ్చి నిర్మాణాలు వేగంగా సాగుతున్న వేళ వైసీపీ వింత పోకడలతో కొత్త ప్రతిపాదనలతో తానుగా గందరగోళంలో పడుతోంది అని అంటున్నారు.

సామాజిక చర్చగా :

ఇదిలా ఉంటే మావిగాన్ లో ఫస్ట్ అక్షరం మచిలీపట్నం ఉంది. అలా మచిలీపట్నానికి రాజధాని హోదా ఇవ్వాలని అభివృద్ధి చేయాలని తాము కోరుతూంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంతా అమరావతిలోనే అంటూ ముందుకు సాగుతోందని వైసీపీ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాపులు అధికంగా ఉన్న ప్రాంతంగా మచిలీపట్నం ఉంది కాబట్టి టీడీపీ వ్యతిరేకిస్తోంది అని వైసీపీ శ్రేణులు స్థానికంగా ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఇది సామాజిక సమస్యగా మారేలా చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. దీంతో అలెర్ట్ కావాల్సిన అవసరం టీడీపీకి ఉందని అంటున్నారు.

వైసీపీకి అక్కడ దెబ్బ :

మావిగాన్ అంటూ ఎండమావులలో నీటిని వెతికే భ్రమలో వైసీపీ ఒక వైపు ఉందని విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో మూడు రాజధానులు అంటూ ఉత్తరాంధ్రకు విశాఖ, రాయలసీమకు కర్నూలు న్యాయ రాజధాని అని ఊరించిన వైసీపీ ఇపుడు మావిగాన్ అని మాట్లాడడంతో తన స్టాండ్ మార్చుకోవడంతో ఆయా ప్రాంతాలలో వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది వస్తుందని అంటున్నారు. వైసీపీ ఎంతగా మావిగాన్ అని ప్రచారం చేస్తూ పోతే అంతలా రాజకీయ నష్టం ఈ ప్రాంతాలలో ఉంటుందని అదే సమయంలో మావిగాన్ ప్రాంతంలో రాజకీయంగా వైసీపీకి ఒరిగేది ఏమీ ఉండదని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద వైసీపీ రాజధాని విషయంలో తరచూ స్టాండ్ మార్చుకోవడం కొత్త పేర్లతో జనంలోకి రావడంతో జగన్ నిలకడలేని తనం మీద వైసీపీకి ఏపీ రాజధాని విషయంలో ఉన్న చిత్తశుద్ధి నిబద్ధత వంటివి తెలియచేస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News