జగన్ 2027 నుంచి ఫుల్ బిజీ...యాక్షన్ ప్లాన్ రెడీ !
2027 జనవరి నెల నుంచి 2029 ఎన్నికల వరకూ అంటే దాదాపుగా రెండున్నరేళ్ళ పాటు జగన్ ప్రజలతోనే ఉండేలా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగబోతున్నారు అని అంటున్నారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మరో అయిదు నెలలలో జనంలోకి పూర్తి స్థాయిలో రాబోతున్నారని అంటున్నారు. 2027 జనవరి నెల నుంచి 2029 ఎన్నికల వరకూ అంటే దాదాపుగా రెండున్నరేళ్ళ పాటు జగన్ ప్రజలతోనే ఉండేలా పూర్తి స్థాయి యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగబోతున్నారు అని అంటున్నారు. ఈ మేరకు తెర వెనక ఏర్పాట్లు కసరత్తు జరుగుతున్నాయని కూడా ప్రచారం సాగుతోంది.
జిల్లా టూర్లతో స్టార్ట్ :
ఇక జగన్ 2027 జనవరి నుంచి జిల్లా టూర్లను స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. ఈ టూర్లు దాదాపుగా ఆరేడు నెలల పాటు సాగుతాయని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల గుండా సాగే ఈ టూర్లలో ప్రతీ జిల్లాలో కనీసంగా రెండు నుంచి మూడు రోజులు గడిపేలీ జగన్ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు. ఈ జిల్లాల టూర్లలో పార్టీ క్యాడర్ ని కలిసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అని అంటున్నారు. అలాగే స్థానిక సమస్యలను తెలుసుకొని జనంతో మమేకం అయి వారితో కలసి వాటి మీద చర్చిస్తారు అని అంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారని కూడా అంటున్నారు.
భారీ పాదయాత్ర కోసం :
ఇక జిల్లాల పర్యటనలు పూర్తి అయిన తరువాత భారీ పాదయాత్రకు జగన్ రెడీ అవుతారు అని అంటున్నారు. ఒకసారి కనుక పాదయాత్ర స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎన్నికల షెడ్యూలు వెలువడేంతవరకూ జనంలో ఉండేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇక చూస్తే 2017 నుంచి 2019 దాకా జగన్ ఏపీలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా భారీ పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్ర అన్ని జిల్లాలను దాటుకుంటూ మొత్తం 3 వేల 700 కిలోమీటర్ల దాకా సాగింది. అది ఒక రికార్డు. ఇపుడు ఆ రికార్డుని తానే బద్ధలు కొట్టేలా ఈసారి భారీ పాదయాత్ర ఉండబోతోంది అని అంటున్నారు. ఈసారి ఏకంగా అయిదు వేల కిలోమీటర్ల దాకా పాదయాత్ర సాగనుంది అని ప్రచారం సాగుతోంది. ఈసారి పల్లెలతో పాటు గతంలో టచ్ చేయని ప్రాంతాలలో జగన్ పర్యటిస్తారు అని అంటున్నారు.
పార్టీని సైతం :
జగన్ 2027 నుంచి జనంలో ఉండడానికి ప్లాన్ చేసుకోవడంతో దానికి తగినట్లుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీని కూడా సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ కూడా అలెర్ట్ గా ఉంటూ దైనందిన కార్యక్రమాలను నడిపించేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. సీనియర్లతో కలిపి ఒక టీం అంతా పనిచేసేలా చూస్తారని అంటున్నారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం మీద పార్టీగా వైసీపీ జోరు చేయడానికి ఆందోళనలు పార్టీ తరఫున చేపట్టడానికి పార్టీ క్యాడర్ కి అందుబాటులో ఉండడానికి ఆల్టర్నేషన్ ప్లాన్స్ కూడా చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద 2027 నుంచి జగన్ జనంలోనే ఉంటారని సాగుతున్న ప్రచారం అయితే వైసీపీ శ్రేణులలో ఉత్సాహం ఇస్తోంది. మరి దీని మీద తుది నిర్ణయం వెలువడడమో అలాగే అధికారిక ప్రకటన ఎపుడు వస్తుంది అన్నది అయితే చూడాల్సి ఉంది అని అంటున్నారు.